Credit card safety tips: ఈరోజుల్లో ప్రతి వస్తువు కొనడానికి క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆన్లైన్ సేవలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుండడంతో చాలామంది ఒకటికి మించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే వీరు ఇలా క్రెడిట్ కార్డులు తీసుకొని వారి స్నేహితులు లేదా బంధువులకు ఇస్తున్నారు. వారు ఈ క్రెడిట్ కార్డులపై రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా స్నేహితులు, బంధువులకు అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసేందుకు మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే.. ఎలాగో తెలుసుకోండి.
కొంతమందికి దయాగుణం ఎక్కువగా ఉంటుంది. తమ తమ జీవితం కంటే ఎదుటివారి జీవితం బాగుండాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి లక్షణం ఉండడం మంచిదే. కానీ నేటి కాలంలో మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది మంచిగా వ్యవహరిస్తూ ఆ తర్వాత చిక్కుల్లో పడితే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగానే కొంతమంది తమ స్నేహితులు, బంధువులు వస్తువులు కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డును ఇవ్వమని అడుగుతారు. వీటి ద్వారా ఆఫర్స్ ఉన్నాయని.. తమకు ఉపయోగపడుతుందని అంటూ ఉంటారు. ఇది వారికి ప్రయోజనం కలిగించవచ్చు.. క్రెడిట్ కార్డు ఇచ్చినందుకు మీపై ప్రేమ చూపించవచ్చు. కానీ ఆ తర్వాత క్రెడిట్ కార్డు ఎవరి పేరు మీద రైతే ఉంటుందో.. వారు ఆర్థిక చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డు పై ఏడాదిలో లిమిటెడ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఒక వ్యక్తి ఆదాయాన్ని బట్టి క్రెడిట్ కార్డు ఇస్తూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి తన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం లేదా ట్రాన్సాక్షన్ జరిపితే ఇన్కమ్ టాక్స్ అధికారుల నుంచి నోటీసులు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పరిమితికి మించి ఆర్థిక వ్యవహారాలు జరపడం వల్ల వాటి గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీ బంధువులు లేదా స్నేహితులు మీకు వచ్చే సహాయం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందువల్ల క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడే ఆలోచించాలి.
నేటి కాలంలో చాలామంది వద్ద క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే ఏదైనా చిన్న చిన్న అవసరాలు.. అత్యవసరాలకు సహాయం చేయడం మంచిదే.. కానీ మరీ అమాయకంగా ఉంటూ ఆఫర్ల కోసం క్రెడిట్ కార్డులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ పరిమితికి మించి ట్రాన్సాక్షన్ జరిపినట్లైతే భవిష్యత్తులో సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అదనంగా ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందువల్ల క్రెడిట్ కార్డులు ఇతరులకు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదా మీ వద్ద క్రెడిట్ కార్డులు ఎక్కువగా లేవని చెప్పాలి.