Cow Milk Vs Buffalo Milk: ఆవుపాలు,గేదెపాలు.. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యం? ఏవి ఎక్కువగా లభిస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆవుపాలే ఎక్కువగా లభ్యమవుతాయి. కానీ మనదేశంలో ఎక్కువ శాతం గేదె పాలు తాగుతూ ఉంటారు. ఆవు కంటే గేదె ద్వారా ఎక్కువ పాలు వస్తాయి.

Written By: Srinivas, Updated On : January 5, 2024 6:30 pm

Cow Milk Vs Buffalo Milk

Follow us on

Cow Milk Vs Buffalo Milk: పౌష్టికాహారంలో పాలు ఒకటి. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ పాలు తాగాలని చెబుతారు. కేవలం పాలు తాగడానికి ఇష్టపడని వారు పాల పదార్థాలను తీసుకున్నా పోషకాలు అందుతాయి. పాలతో అనేక పదార్థాలు తయారవుతాయి. అయితే ఆవుపాలు, గేదెపాలు లభ్యమవుతుండడంతో ఈ రెండింటిలో ఏది మంచిది? అని చాలామందికి సందేహం ఉంటుంది. ఈ రెండింటిలో ఎటువంటి ప్రోటీన్లు ఉంటాయో? ఎవరు ఏ పాలు తాగితే ఆరోగ్యమో తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా ఆవుపాలే ఎక్కువగా లభ్యమవుతాయి. కానీ మనదేశంలో ఎక్కువ శాతం గేదె పాలు తాగుతూ ఉంటారు. ఆవు కంటే గేదె ద్వారా ఎక్కువ పాలు వస్తాయి. అంతేకాకుండా గేదె పాలు ఎక్కువ రుచిని కలిగి ఉంటాయి. గేదె పాలల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. గేదె పాలు ఎక్కువ సేపు నిల్వ ఉంచవచ్చు. గేదె పాలను తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. గేదె పాలతో కోవా, పనీర్ తయారు చేస్తారు. అయితే లాక్టోస్ ఎలర్జీ సమస్య ఉన్నవారు గేదె పాలకు దూరంగా ఉండాలి.

ఆవుపాలల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. గుండె సమస్య ఉన్నవారు ఆవుపాలు తాగడం వల్ల ఎంతో మంచిది. ఆవు పాలల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరిగే సమస్య అస్సలు ఉండదు. ఆవుపాలు ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు ధృఢంగా మారుతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. చిన్న పిల్లలకు ఆవుపాలు తాగించడం వల్ల వారి మైండ్ షార్ప్ అవుతుంది. ఆవు పాలల్లో ప్రోటీన్లు, కార్పో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

బరువు ఎక్కువగా ఉన్నవారు గేదె పాల కంటే ఆవు పాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవు పాలు 2 రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటాయి. గేదె పాలు అంతకంటే ఎక్కువరోజులు నిల్వ చేసుకోవచ్చు. ఆవు పాలల్లో తక్కువ కొవ్వు ఉండడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. కానీ గేదె పాలు కొందరికి జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆవుల కంటే గేదెలను పెంచడం తేలిక. ఇవి ఎటువంటి రోగాలనైనా తట్టుకుంటాయి. కానీ ఆవులు కొన్ని వ్యాధులను తట్టుకోలేవు. అయితే గేదె పాలకంటే ఆవు పాలే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయి.