Corona 4th Wave In India: కరోనా మహమ్మారి మరోమారు విస్తరించనుంది. తన రూపం మార్చుకుని కొత్త వేరియంట్ తో ప్రజలను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా చైనాలో రోజువారీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అన్ని దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే సరికొత్త లక్షణాలతో దాడి చేసేందుకు రూపాలు మార్చుకుంటోంది. వేరియంట్ల ప్రభావంతో ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు రెడీ అవుతోంది. అంతా సవ్యంగాఉందని భావిస్తున్న తరుణంలో నాలుగో దశ ముప్పు తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే డెల్టా వేరియంట్లతో భయపెట్టిన వైరస్ మరోసారి ప్రజలపై దాడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందు కోసం మరోసారి ప్రపంచం అలర్ట్ అయింది. ఇటీవల నిబంధనలు ఎవరు పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో వైరస్ ఉధృతి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మరోమారు ఆంక్షలు విధించేందుకు చైనా సిద్ధమైంది. అక్కడ రోజువారీ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
Also Read: కరోనా మళ్లీ విజృంభణ.. ఒకే రోజు 4 లక్షల కేసులు
భారత్ లో నాలుగో దశ ముప్పు పొంచి ఉందా? వస్తే ఎలా ఎదుర్కోవాలి? కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాలను అలర్ట్ చేస్తున్నారు. నాలుగో దశ ముప్పుపై ముందే జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. మంగళవారం చైనాలో 5280 కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.

మరోవైపు చైనాతో పాటు పశ్చిమ యూరప్, బ్రిటన్, అమెరికాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ లలో కూడా రోజువారీ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో కరోనా వైరస్ ను దేశంలో వ్యాపించకుండా చేయాలని చూస్తున్నారు. నాలుగో దశ ముప్పు నుంచి రక్షించుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.
Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట
[…] […]