Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!

Kapu Reservation: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాలను చేజిక్కించుకొని తనకు ఎదరులేదని నిరూపించింది. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకున్న బీజేపీ తాజాగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణపై దృష్టిసారించింది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదిగింది. ఏపీలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేనప్పటికీ కేంద్రం అండగా ఏపీని కాపు కాసేందుకు రెడీ అవుతోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సామాజిక […]

Written By: NARESH, Updated On : March 17, 2022 12:43 pm
Follow us on

Kapu Reservation: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాలను చేజిక్కించుకొని తనకు ఎదరులేదని నిరూపించింది. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకున్న బీజేపీ తాజాగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణపై దృష్టిసారించింది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదిగింది. ఏపీలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేనప్పటికీ కేంద్రం అండగా ఏపీని కాపు కాసేందుకు రెడీ అవుతోంది.

BJP

ఏపీలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సామాజిక వర్గం ఏదైనా ఉందంటే కాపు సామాజిక వర్గం మాత్రమే. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆపార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో వారంతా 2019 నాటికి వైసీపీకి జై కొట్టారు. దీంతో బంపర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లోనూ ఈ వర్గం ఓటు బ్యాంకే కీలకం కానుంది.

Also Read:  టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?

ఈక్రమంలోనే టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ‘కాపు ఓటర్ల’ను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాపుల్లో పవన్ కల్యాణ్ కు ఫాలోయింగ్ బలంగా ఉండటంతో అభిమానులు సైతం రాబోయే ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ అండతో ఏపీ బీజేపీ నేతలు కాపులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కాపుల రిజర్వేషన్ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయంగా తేలిపోయింది. టీడీపీ తమతో కలిసి వచ్చినా రాకపోయినా కాపు వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. తద్వారా ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే కాపు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కాపు ఏజెండాను ముందుకు తీసుకెళుతోంది. ఏపీలో కాపు రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి కేంద్రం ఆమోదం కావాలని ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి.

ఈక్రమంలోనే ఏపీలో కాపు రిజర్వేషన్ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిన్న పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్రం తరఫున సామాజిక న్యాయశాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ క్లారిటీ ఇచ్చారు. ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని వెల్లడించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ కేంద్రం తేల్చి చెప్పడంతో ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశంపైన క్లారిటీ వచ్చింది.

YCP

ఓబీసీలో కాపు రిజర్వేషన్లు కూడా ఇచ్చే అధికారం ఏపీకి ఉందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీలో కాపు రిజర్వేషన్ డిమాండ్ తెరపైకి రానుంది. కేంద్రం స్పష్టంగా చెప్పిన తర్వాత వైసీపీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఆపార్టీ బలంగా దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు ఇదే నినాదంతో బీజేపీ, జనసేన డిమాండ్ చేస్తూ కాపు ఓటర్లను తమవైపు తిప్పుకునే అవకాశం ఉండనుండటంతో వైసీపీ సర్కారు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:  జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట

Tags