Cognizant CEO Ravikumar: ధన మూలం ఇదం జగత్. ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది.. డబ్బు ఉన్న వాళ్ళ మాటే వింటుంది. డబ్బు ఉన్న వాళ్లకే దాసోహం అంటుంది. మన మీడియా కూడా డబ్బున్నవాళ్లు ఏటా ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయాలనే వార్తలుగా రాస్తూ ఉంటుంది.. ఆ జాబితాలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఎక్కడికో తీసుకెళ్లాడు.. తన ముగ్గురు పిల్లలకు పలు బాధ్యతలు అప్పగించి మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు.. అంతేకాదు అత్యధికంగా వేతనం అందుకుంటున్న సీఈవోగా ముఖేష్ అంబానీ పేరిట ఇప్పటివరకు ఒక రికార్డు ఉండేది. ఇప్పుడు అది బ్రేక్ అయింది.

ముఖేష్ అంబానీ రికార్డు ను కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవికుమార్ బ్రేక్ చేశారు.. రవికుమార్ జీతం సంవత్సరానికి 57 కోట్లు.. పాటు 6 కోట్ల జాయినింగ్ బోనస్ కూడా అందుకోనున్నారు. ఇవే కాకుండా వార్షిక బేసిక్ శాలరీగా ఒక మిలియన్ డాలర్లు, నగదు ప్రోత్సాహకం, వన్ టైం హైర్ అవార్డుగా ఐదు మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్లు ఆయన పొందనున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా అంబానీ కేవలం ఒక రూపాయి మాత్రమే జీతం గా తీసుకుంటున్నారు.. రవికుమార్ తీసుకుంటున్న వేతనం 2020లో
ఇది అంబానీ తీసుకున్న జీతం కంటే నాలుగు రెట్లు అధికం.. అప్పట్లో అంబానీ వేతనం 15 కోట్లుగా ఉండేది.
రవికుమార్ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ గా పని చేశారు. కుమార్ కంటే ముందు బ్రియాన్ హాంఫ్రీస్ కాగ్నిజెంట్ సీఈవో గా ఉండేవారు. రవికుమార్ కాగ్నిజెంట్ సీఈవో గానే కాకుండా కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్నారు.. ఆన్ డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్, ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు.. దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్ వార్షిక వేతనం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.

2016 నుంచి 2022 మధ్యకాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు రవికుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.. రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలను కొనసాగారు.. కాకుండా ట్రాన్స్ యూనియన్, డిజి మార్క్ కార్ప్ బోర్డులో పనిచేశారు.. హంఫ్రీస్ రాజీనామా చేయడంతో రవి కుమార్ ను కాగ్నిజెంట్ ఎంపిక చేసింది. అయితే హంఫ్రీస్ మార్చి 15 వరకు సలహాదారుడిగా కాగ్నిజెంట్ కంపెనీలోనే ఉంటాడు. అయితే రవికుమార్ కు ఇస్తున్న వేతనం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.