New social media rules: మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పనుల కోసం దీనిని ఎక్కువగా వాడుతున్నారు. కొందరు మొబైల్ తోనే వ్యాపారం చేస్తున్నారంటే ఎవరు నమ్మరు. అయితే ఇటీవల ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరు influencer గా వారి విద్యార్థులకు, ఇతరులకు విలువైన సూచనలు అందిస్తున్నారు. అయితే ఈ సూచనలు అందించేవారు ఆ సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహన ఉందా? లేదా? అనే విషయం మనకు తెలియదు. కానీ కొన్ని విషయాలపై వీరు సలహాలు ఇస్తుంటారు. ఈ సలహాలు పాటించిన వారు సమస్యలను ఎదుర్కొన్న వారు ఉన్నారు. అయితే చైనాలో ఈ సమస్య లేకుండా ఒక కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇకనుంచి వీడియో రీల్ చేయాలంటే కచ్చితంగా ఈ నిబంధనలు ఉండాలని తెలిపింది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటంటే?
ప్రపంచంలో అమెరికాను ఢీకొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టెక్నాలజీని ఎక్కువగా వాడుకుంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని నిబంధనలు కూడా అందుబాటులోకి తీస్తోంది. టిక్ టాక్ వంటి యాప్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది రీల్స్ చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొందరు ఎంటర్టైన్మెంట్.. మరికొందరు సోషల్ అవేర్నెస్ వంటి వీడియోలు చేస్తున్నారు. ఉదాహరణకు హెల్త్, లా, సైన్స్ వంటి వీడియోలు కూడా చేస్తూ సలహాలు ఇస్తున్నారు. అయితే సలహాలు ఇచ్చేవారు ఆ సబ్జెక్టుపై పూర్తిగా అవగాహన ఉందా? లేదా? అనే విషయాన్ని ఎవరు వెరిఫై చేయరు. కానీ చైనా మాత్రం ఇకనుంచి ఈ విషయాన్ని కచ్చితంగా వెరిఫై చేసేందుకు నిబంధన తీసుకొచ్చింది.
ఇకనుంచి ఎవరైనా రిల్ చేయాలంటే వారు చెప్పే సబ్జెక్టుపై కచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. ఉదాహరణకు ఆరోగ్యం పై సలహాలు ఇస్తున్నారంటే.. అందులో కచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. అలా చేయకపోతే వారు ఆ సబ్జెక్టు పై రీల్స్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా నిబంధనలను అతిక్రమించి రిల్స్ చేస్తే వాటిని డిలీట్ చేయడమే కాకుండా.. రూ.12 లక్షల వరకు జరిమానవేసి అవకాశం ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా వారి డిగ్రీలపై వెరిఫై చేసే అవకాశం ఉంది. ఏమాత్రం డిగ్రీలు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం చాలామంది ఎలాంటి డిగ్రీలు లేకుండానే కొన్ని రకాల పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల వల్ల కొందరు రియాక్ట్ అయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు వైద్యంపై అవగాహన లేకున్నా కూడా.. వైద్య సలహాలు ఇస్తున్నారు. వీటిని పాటించిన వారు ఆస్పత్రుల పాలైన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి చైనా ప్రభుత్వం ఏ నిబంధనలను తీసుకువచ్చింది. అయితే మనదేశంలో కూడా ఇలాంటి నిబంధనలు ఉండాలని చాలామంది అంటున్నారు. మరి ఇక్కడ రిలీజ్ చేసే వారిపై ఎలాంటి నిబంధనలు పెడతారో చూడాలి..