Childrens Behavior: పిల్లలు మనస్తత్వం ఎంతో సున్నితమైనది. వారికి మనం ఎలా చెబితే వారి మనస్సు ఆ పదాలను మాటలను అలాగే స్వీకరించి వారి వ్యక్తిత్వం కూడా అలాగే మారుతుంది. ఈ క్రమంలోనే పిల్లల ముందు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పొరపాటున కూడా పిల్లల దగ్గర కొన్ని మాటలను అస్సలు మాట్లాడకూడదు. అలాంటి మాటలను మాట్లాడినప్పుడు వారి పసి వయసు ముక్కలైపోయి ఇతరులపై వారికి ఎన్నో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.అయితే పిల్లల ఎదుట తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అనే విషయానికి వస్తే….
Also Read: సోమవారం శివుడిని పూజించడానికి గల కారణం ఏమిటో తెలుసా?
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చి మాట్లాడకూడదు. పక్కన వారు ఎంతో తెలివైన వారు మంచి వారు అంటూ వారి దగ్గర మాట్లాడటం వల్ల వారిలో ఇతరుల గురించి తెలియని అసూయ ఏర్పడుతుంది. అందుకే పిల్లల ఎదుట ఎవరిని పొగడ కూడదు.అదే విధంగా ఏదైనా పని చేస్తున్న సమయంలో నీకు ఈ పని చేతకాదు నువ్వు చేయలేవు అంటూ పిల్లలను నిరుత్సాహ పరచకూడదు.అలా అనటం వల్ల వారిలో ఆత్మ విశ్వాసం దెబ్బతిని ఎలాంటి వాటిలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు.
పిల్లలలో ఎప్పుడు అమ్మాయి అబ్బాయి అనే భేదం చూపించకూడదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడ మగ అని తేడా లేకుండా పోటీ పడుతున్నారు కనుక వారి మధ్య తారతమ్యం లేకుండా అన్ని రంగాలలోనూ వారిని ప్రోత్సహించాలి. పిల్లలు వారికి ఫలనాది కావాలి అని అడిగినప్పుడు పెద్దవారు వాటిని అర్థం చేసుకుని వారికి వాటిని తీసుకురావాలి అంతేకాని లేదు ఇవ్వను అనే మాటలను చెప్పకూడదు. ఇలాంటి మాటలను పిల్లల దగ్గర ఉపయోగించడం వల్ల వారి మనసులో అవి బలంగా నాటుకుపోయి మానసికంగా ఎంతో కృంగిపోతారు.
Also Read: బ్యాంక్ అకౌంట్ తెరిస్తే 6 లక్షల రూపాయల బెనిఫిట్.. ఎలా అంటే?