Ilayaraja: ఆయన సంగీతానికి నవనాడులు స్పందిస్తాయి. విరహం, సంతోషం, ఉత్సాహం ఇలా భావం ఏదైనా తన మ్యూజిక్ మాయతో అందర్నీ కట్టిపడేసి బానిస చేసిన వ్యక్తి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా. ఇటీవల ఆయనకు మరోఅరుదైన సత్కారం లభించింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క‍్వేర్ బిల్‌బోర్డుపై ఆయన బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఇళయరాజా తన అధికారిక ఫేస్బుక్ పేజి ద్వారా ప్రకటించారు. మ్యూజికల్ స్ట‍్రీమింగ్ సర్వీస్ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు.
Our own #Isaignani at #timesquare proud us🙏🏽👍🏽 pic.twitter.com/SEd60IJEFP
— venkat prabhu (@vp_offl) November 19, 2021
న్యూయార్క్‌లో ఇసైజ్ఞాని (మ్యూజికల్ జీనియస్) ఇళయరాజా పోస్టర్‌ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ఈ విజయం ఆయన కెరీర్‌లో ఒక మెట్టుగా అభివర్ణించారు. ఇటీవల స్పూటీఫైతో ఆయన జతకట్టి, ప‍్రచార కర్తగా మారారు. స్పూటీఫైలో ఆయన ప్లేలిస్ట్‌లను ప్రమోట్ చేయడానికి 3 నిమిషాల నిడివి గల యాడ్ ఫిల్మ్‌లో కనిపించారు ఇళయరాజా. ఈ క్రమంలోనే నవంబర్ 19న టైమ్స్ స్క‍్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా బ్యానర్ ప్రదర్శించారు.
ఆయన కెరీర్‌లో కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించారు. కొన్ని లక్షల పాటలు సమకూర్చారు. నాటి తరంలో ఆయన సమకూర్చిన పాటలు.. ఇప్పటికీ మరపురాని స్వరగీతాలుగా కుర్రకారుని కట్టిపడేస్తున్నాయంటే ఆ స్వరకల్పనలోని మాధ్యుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇళయరాజా విదుతాలయి, మాయన్, తుప్పరివాళన్, తమిళరసన్ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.