Nightmares: మనం రోజు నిద్రలో చాలా మంది కలవర పడుతుంటారు. ఉదయం చేసిన పనులు కూడా రాత్రి కలలో కలవరిస్తుంటారు. పిల్లలకు పీడ కలలు వస్తే మేల్కొని మరీ భయపడుతుంటారు. ఏవో కలవరిస్తూ గజగజ వణుకుతుంటారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కలిగే బాధలు ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు అయోమయంలో పడిపోతున్నారు. దీంతో వారు కలలో కలవరపాటుకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే పిల్లల భయం అలాగే ఉండిపోతే వారి ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతుంది. ఈ క్రమంలో పిల్లల కలవరాన్ని ఏమరుపాటుగా తీసుకోకుండా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకుని ఆ దిశగా ఆలోచించి బయటపడాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నిద్ర పోయే ముందు మనం కొన్ని చిట్కాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్ర పోకూడదు. ఇలా చేస్తే పీడకలలు వస్తాయని చెబుతుంటారు. నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు వైపుల రాతి ఉప్పును పోస్తే ప్రతికూల శక్తులు రావని నమ్ముతుంటారు. దీంతో ప్రశాంతంగా నిద్ర పోవచ్చని సూచిస్తున్నారు. చెంబు నీటిని తీసుకుని మంచం మూలలో పెట్టి తెల్లవారు జామున వాటిని పారబోస్తే కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. సుఖమైన నిద్ర పోవడానికి వీలవుతుంది. ఆందోళన కలిగించే సినిమాలు, సీరియల్స్ చూడటం మానేయాలి. దీంతో మనకు నెగెటివ్ ఎనర్జీ రాదు.
నిద్రలో చెడు కలలు వచ్చే వారు దిండు కింద రెండు లవంగాలు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకోవడం కూడా మంచిదే. దీంతో కూడా మనకు నిద్రకు భంగం కలగదు. కొబ్బరి నూనెను పాదాలకు రాసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు. తరచూ పీడకలలు పడేవారు దిండు కింద ఇనుప కత్తిని పెట్టుకోవడం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు రాకుండా ఉంటాయని వాస్తు పండితుతు చెబుతున్నారు.

ఇంకా పడుకునే ముందు జుట్టును విడిచిపెట్టడం కూడా మంచిది కాదు. పడుకునే ముందు చెప్పులను మంచం కింద పెట్టుకోకూడదు. అటాచ్డ్ బాత్ రూం ఉంటే దాని తలుపు పూర్తిగా మూసి వేయాలి. సగం తెరిచి ఉంచితే కూడా ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. బెడ్ కింద ఎటువంటి వస్తువులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రయోజనం. దీనికి అన్ని చిట్కాలు ఉపయోగించి వారికి సుఖమైన నిద్ర పట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.