Homeక్రీడలుGujarat Vs Chennai: మూడోసారి ఓడిన చెన్నై.. హిస్టరీ రిపీట్ చేసిన గుజరాత్ టైటాన్స్..!

Gujarat Vs Chennai: మూడోసారి ఓడిన చెన్నై.. హిస్టరీ రిపీట్ చేసిన గుజరాత్ టైటాన్స్..!

Gujarat Vs Chennai
Gujarat Vs Chennai

Gujarat Vs Chennai: అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ 16వ ఎడిషన్ లో హిస్టరీ రిపీట్ అయింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో హిస్టరీ రిపీట్ అయింది.

ఐపీఎల్ స్వీట్ 16 సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించింది. ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో కూడా హిస్టరీ రిపీట్ అయింది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ను చెన్నై ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. గత ఐపీఎల్ లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ల్లో చేజింగ్ చేసిన గుజరాత్ విజయాలు నమోదు చేసింది. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని కొత్త సీజన్ ను విజయంతో మొదలు పెట్టాలని చెన్నై భావించింది. కానీ చెన్నై అంచనాలు తలకిందులు అయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఓపెనర్ రుతురాజు గైక్వాడ్ మరోసారి తన సత్తా చూపించాడు. మణికట్టుగాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన అతను.. ఈ మ్యాచ్ లో 50 బంతుల్లోనే 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ పై రుతురాజు గైక్వాడ్ కు ఇది వరుసగా మూడో అర్ధ సెంచరీ. గత ఏడాది ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా రుతురాజ్ అర్ధ సెంచరీలతో రాణించాడు.

భారీ స్కోరు చేయడంలో చతికిల పడిన చెన్నై..

ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ మెరుగైన ఆట తీరుతో భారీ స్కోరు దిశగా చెన్నై టీమ్ సాగింది. గైక్వాడ్ ఉన్నంత సేపు చెన్నై జట్టు స్కోరు 200 దాటుతుందని అనిపించింది. కానీ ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరు ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గతంలోనూ ఇదే తరహాలో బ్యాటర్లు విఫలం కాగా, ఈ సీజన్ లోని తొలి మ్యాచ్లో కూడా బ్యాటర్లు అలానే చేతులెత్తేశారు. దీంతో చెన్నై అనుకున్న స్కోర్ చేయలేక పెవిలియన్ చేరింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. గైక్వాడ్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ధోని చివరలో ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. దీంతో చెన్నై 178/7 స్కోర్ చేయగలిగింది.

ప్రభావం చూపించలేకపోయినా చెన్నై బౌలర్లు..

ఒకరకంగా చూస్తే చెన్నై జట్టు మంచి స్కోర్ చేసింది. అయితే ఈ స్కోర్ ను డిఫరెంట్ చేయడంలో చెన్నై బౌలర్లు విఫలమయ్యారు. చెన్నై జట్టులో అద్భుతమైన బౌలర్లు లేకపోవడంతో కూడా జట్టుకు సమస్యగా మారింది. అరంగేట్ర బౌలర్ రాజ్ వర్ధన్ హంగ్రేకర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో చెన్నై జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. దీంతో గుజరాత్ సులభంగానే లక్ష్యాన్ని చేదించింది. రుతురాజ్ కష్టం బుగ్గిపాలయింది. వరుసగా మూడోసారి గుజరాత్ చేతిలో చెన్నై ఓటమి పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఐపీఎల్ లో హిస్టరీ మరోసారి రిపీట్ అయినట్టు అయింది.

Gujarat Vs Chennai
Gujarat Vs Chennai

కిక్కిరిసిన మైదానం..

గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్ కు వీక్షించేందుకు వేలాదిగా క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. తమ అభిమాన క్రికెటర్లను చూసిన ప్రతిసారి అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ముఖ్యంగా ధోనిని చూసిన ప్రతిసారి స్టేడియంను అభిమానులు హోరెత్తించారు. ధోని సిక్స్, ఫోర్ బాదిన సమయంలో స్టేడియం అభిమానుల కేరింతలు, హర్షద్వానాలతో మార్మోగిపోయింది.

RELATED ARTICLES

Most Popular