Sunday: ఆదివారమంటే అందరికి ఇష్టమే. ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి. అసలు ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసా? దీనికి కారకులు ఎవరని ఆలోచించారా? మిగిలిన రోజులు ఎందుకు సెలవులు కావు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెలవు కావడంతో ఆ రోజు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ లో ప్రజలు ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఉద్యోగులు సైతం ఆదివారం సెలవును ఇంట్లో ఉండి సరదాగా గడుపుతుంటారు.

అసలు ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలనే ఆతృత అందరికి ఉంటుంది. ఆదివారం పండుగ రోజులా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇష్టమైన వంటలు చేసుకుని రుచులు ఆస్వాదిస్తూ సరదాగా కాలం వెళ్లదీస్తుంటారు. పనికి సెలవు దినం కావడంతో పనికి అందరు దూరంగా ఉండడం తెలిసిందే. దీంతో ఆదివారానికి ప్రత్యేకత వచ్చింది.
ఆదివారం సెలవుపై అంతులేని కథ నడిచినట్లు పూర్వీకుల ద్వారా తెలుస్తుంది. ఆదివారాన్ని వారాంతపు సెలవు దినంగా ప్రకటించేందుకు 1986లో ప్రకటించబడింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) ప్రకారం ఆదివారం సెలవు రోజుగా పరిగణింపబడింది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవు దినంగా చేసుకున్నారు. క్రమంగా ఈ రోజును సెలవు రోజుగా గుర్తించారు.
ఆదివారం సెలవు రోజు కావడానికి కూడా కొన్ని మతపరమైన కారణాలు సైతం మనకు కనిపిస్తున్నాయి. రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టంట్ క్రైస్తవులు ఆదివారంను దేవుని రోజుగా చెబుతారు. క్రైస్తవుల మత గ్రంథం బైబిల్ లో కూడా దీనికి ప్రత్యేక స్థానం కల్పించబడింది. క్రీస్తు చనిపోయిన తరువాత మూడో రోజు బతికాడని చెబుతారు. ఆ రోజు కూడా ఆదివారమే కావడం గమనార్హం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అనంతరం వచ్చే రోజును ఈస్టర్ సండే గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆదివారానికి ప్రత్యేకత సంతరించుకుందని తెలుస్తోంది.
మనదేశంలో కూడా బ్రిటిష్ కాలం నాటి నుంచే వారంతంలో సెలవు కావాలని డిమాండ్ చేశారు. దీంతో వారంతంలో ఆదివారాన్ని సెలవు రోజుగా ప్రకటించాలని ఒత్తిడి పెరిగిన క్రమంలో ఆదివారం సెలవు అని గుర్తించేందుకు అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది. 1889లో ఆదివారం సెలవు గా అందరు గుర్తించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
భారతదేశంలో ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. వారంతపు రోజు కావడంతో అందరు ఇంట్లో ఉండి సరదాగా గడపడం తెలిసిందే. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని అందరు పాటిస్తున్నారు. ఎంజాయ్ చేసేందుకు వేదికగా ఎంచుకుంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం సెలవు రోజుగా గుర్తించబడింది. దీంతో ప్రజలు తమ సరదాలకు కేంద్రంగా ఆదివారం వెలుగులోకి రావడం ఆహ్వానించదగినదే.