Diabetes and Heart disease: మనలో చాలామంది ఆయిల్ పుల్లింగ్ గురించి వినే ఉంటారు. ఆయిల్ పుల్లింగ్ ద్వారా అనేక వ్యాధులకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. నేషనల్ లైబ్రరీ హెల్త్ తాజాగా ఆయిల్ పుల్లింగ్ ద్వారా కొన్ని వ్యాధులను తగ్గించవచ్చని వెల్లడించింది. దైహిక వ్యాధులను నయం చేయడంలో ఆయిల్ పుల్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. మానవులలో దీర్ఘాయువును మెరుగుపరచడంలో ఆయిల్ పుల్లింగ్ సహాయపడుతుంది.

ఆయిల్ పుల్లింగ్ శరీరం జీవక్రియలను పెంచడంతో పాటు కణాలు, కణాజాలాలు, శరీర అవయవాలకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో తోడ్పడుతుంది. ఆయిల్ పుల్లింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉండటంతో పాటు అర్థరైటిస్ అభివృద్ధి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఆయిల్ పుల్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.
ఆయిల్ పుల్లింగ్ చేయాలని భావించే వాళ్లు ఖాళీ కడుపుతో మాత్రమే ఆయిల్ పుల్లింగ్ ను చేయాల్సి ఉంటుంది. టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను తీసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు స్విష్ చేసి తరువాత ఉమ్మివేయాలి. 5 సంవత్సరాల వయస్సు పైన ఉన్న వ్యక్తులు మాత్రమే ఆయిల్ పుల్లింగ్ ను చేయాల్సి ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్ ద్వారా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు నియంత్రణలో ఉంటాయి.
మధుమేహం, ఆస్తమాతో పాటు మరికొన్ని సమస్యలకు చెక్ పెట్టడంలో ఆయిల్ పుల్లింగ్ ఎంతగానో తోడ్పడుతుంది. 30 కంటే ఎక్కువ వ్యాధుల నివారణ కోసం ఆయిల్ పుల్లింగ్ ను ఉపయోగించవచ్చు. ఆయిల్ పుల్లింగ్ థెరపీ నోటి బ్యాక్టీరియాను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.