Actress Nayanatara: లేడీ సూపర్ స్టార్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నయనతార. సినిమా జీవితం వరకు నయనతార మంచి వెలుగు వెలుగుతున్నారు. నయనతార ఎక్కువగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలకు గురవుతారు. తమిళ్ హీరో శింబుతో లవ్ ఎఫైర్ నుండి ప్రభుదేవాతో వివాహం వరకు విమర్శల ఎదుర్కొన్నారు.
అయితే ఇప్పుడు నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేష్ ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట షిరిడి, ముంబైలో సిద్ధి వినాయక ఆలయం, కర్ణాటకలోని పురాతన దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. కాగా నయనతార పుట్టుకతో క్రిష్టియన్ అయితే హిందూ మతం పట్ల నమ్మకంతో మతం మారారు. వీరి జంటకు వివాహ దోషాలు ఉన్నట్లు జ్యోతిష్యులు చెప్పడంతో… తను ముందుగా విఘ్నేష్ వివాహం చేసుకోకూడదని సమాచారం. మొదట ఒక చెట్టుతో లేదా జంతువులతో వివాహం చేసుకోవాలని జ్యోతిష్యులు సూచించినట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి విషయాలను ప్రాధాన్యత ఇవ్వరు కానీ… నయన్ మాత్రం వీటిని విశ్వసిస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఐశ్వర్య కూడా అభిషేక్ తో వివాహం బంధంలో సమస్యలు రాకుండా… జ్యోతిష్యులు చెప్పడంతో చెట్టును వివాహం చేసుకున్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. ఇప్పుడు నయనతార కూడా అదే మార్గంలో వెళుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ వర్తతో నయన్ అభిమానులు కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తుంది .