Constipation : ఈ గింజలతో మలబద్ధకం సమస్యకు చెక్

ఇది ప్రేగులోని కొలెస్ట్రాల్ లేకుండా శోషణ చేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం ఎక్కడా అడ్డుపడకుండా మోషన్ ఫ్రీ అవుతుంది.

Written By: NARESH, Updated On : October 2, 2023 4:35 pm
Follow us on

Constipation : నేటి కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. రోజూ తినే ఆహారంతో పాటు శరీరంలో వస్తున్న మార్పుల కారణంగా కొంతమందికి ఫ్రీ మోషన్ ఉండదు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. మరికొందరు వ్యాయామం చేస్తున్నారు. కానీ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందే ఛాన్స్ ఉంటుంది. వీటిలో ప్రధానంగా సబ్జ గింజలు. వీటి గురించి చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అంతేకాకుండా అవైడ్ చేస్తారు. కానీ మలబద్ధకం సమస్యను ఇవి ఎలా పరిష్కరిస్తాయో తెలుసుకుందాం…

ఉదయం లేవగానే తీవ్ర మనోవేదన కలిగించే విషయం మలబద్ధకం సమస్య. దీని గురించి ఎవరికి చెప్పుకోలేం. కొందరు వైద్యు ల వద్దకు వెళ్లినా సమస్య పరిష్కారం కాదు. డైలీ తీసుకునే ఫుడ్ తో పాటు నిశ్చలమైన జీవనస్థితి, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటిని మలబద్ధకం సమస్యకు కారణాలుగా ఉన్నాయి. అలాగే నీరు తక్కువ తీసుకున్న వారితో పాటు ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో ఈ సమస్య పెరిగిపోతుంది. మలబద్ధకం సమస్య ప్రారంభంలోనే అప్రమత్తమైతే ఎలాంటి బాధ ఉండదు. కానీ నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.

అయితే మలబద్ధకం సమస్యకు సబ్జగింజలు దివ్యౌషధం లా పనిచేస్తాయని కొందరు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గణపత్రి చెట్టు నుంచి వచ్చే ఈ గింజలు పల్లెటూర్లలో విరివిగా లభిస్తాయి. కానీ వీటిని నుంచి సేకరించిన గింజలను ఇప్పుడు పట్టణాల్లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. సబ్జగింజలు శరీరంలోని వేడిని పూర్తిగా తీసేస్తాయి. అంతేకాకుండ జీర్ణ క్రియ సక్రమంగా సాగడానికి ఉపయోగపడుతాయి. ప్రతిరోజూ పరగడుపున సబ్జగింజల నీరు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

సబ్జగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్యను కూడా నివారించే అవకాశం ఉంది. సబ్జగింజల్లో పెక్టిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ప్రేగులోని కొలెస్ట్రాల్ లేకుండా శోషణ చేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం ఎక్కడా అడ్డుపడకుండా మోషన్ ఫ్రీ అవుతుంది.