Cheap Churidar Prices: వ్యాపారంలో రాణించాలని కొందరు ఆరట పడుతూ ఉంటారు. ఒకరికిందా పనిచేయడం కంటే సొంతంగా చిన్న వ్యాపారమైన ప్రారంభించాలని చూస్తారు. అయితే ఎటువంటి వ్యాపారం చేయాలి? ఎందులో ఎక్కువగా ప్రాఫిట్ ఉంటుంది? అనే విషయాలపై తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటారు. నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకుంటూ ఉంటారు. అయితే వ్యాపారం చేయాలని అనుకునేవారు ఎవరికి వారే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడ తక్కువ ధరకు ముడిసరుకు దొరుకుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు దుస్తుల వ్యాపారం చేయాలని అనుకునేవారు హోల్ సేల్ గా దుస్తులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి.. షాప్ ద్వారా విక్రయించాలని అనుకుంటారు. అయితే ఆడవారికి సంబంధించిన చీరలు, చుడీదార్లు అతి తక్కువ ధరకే లభించే ప్రదేశం ఒకటి ఉంది. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం..
దుస్తుల వ్యాపారంలో ఎక్కువ లాభం ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు. అంతేకాకుండా చిన్న పెట్టుబడి తో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఆడవారి కి సంబంధించిన దుస్తుల విక్రయం షాపులు నష్టాల బారిన పడిన సంఘటనలు చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు. అందుకే ఎక్కువ శాతం చీరలు, చుడీదార్లకు సంబంధించిన షాపులే వెలుస్తూ ఉంటాయి. కొత్త షాపులు ఎక్కడ ప్రారంభించిన మహిళలు ఇక్కడికి వెళ్లి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే వారిని ఆకర్షించేందుకు నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉంటే ఎప్పటికీ కొనుగోలు ఉండే అవకాశం ఉంది. అలాంటి నాణ్యమైన దుస్తులు గుజరాత్ రాష్ట్రంలో అతి తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
Also Read: Life Style: పెళ్లికాని ప్రసాదులు జాగ్రత్త..35దాటితే అది కష్టమేనట
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో కొన్ని దుకాణాలు అతి తక్కువ ధరకే హోల్ సేల్ గా దుస్తులను విక్రయిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే.. ఒక్కో చీర రూ.45 మాత్రమే. అలాగే చుడీదార్ రూ.79 కే విక్రయిస్తున్నారు. ఇక బోటిక్ సంబంధించిన చుడీదార్ కాస్త ఖరీదును కలిగి ఉంటుంది. అయితే ఇవి నాణ్యమైనవిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దుస్తుల వ్యాపారం చేయాలని అనుకునేవారు ఇక్కడికి వెళ్లి పెద్ద మొత్తంలో దుస్తులను కొనుగోలు చేసి చిన్న షాపుల ద్వారా విక్రయిస్తున్నారు. చాలామంది ఇక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపరు. కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని కొందరు చెబుతున్నారు. సూరత్ లోని చాలా షాపుల్లో అతి తక్కువ ధరకే దుస్తులను విక్రయిస్తున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ఇవి నాణ్యమైనవిగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో ఇక్కడ దుస్తులు కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో విక్రయించడం వల్ల అధిక లాభం పొందవచ్చని చెబుతున్నారు. మహిళలకు సంబంధించిన దుస్తులు మాత్రమే కాకుండా మగవారికి సంబంధించిన అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఇక్కడికి వెళ్లి దుస్తులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.
View this post on Instagram