Beer Health Benefits And Risks: మద్యపానం హానికరం అని చాలాచోట్ల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. కానీ మద్యం ప్రియులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రతిరోజు కనీసం రెండు పెగ్గులు వైన్ తీసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే కొందరు విస్కీ వైన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరికొందరు మాత్రం బీర్లు తాగాలని చూస్తుంటారు. బీర్లు చల్లగా ఉండడంతోపాటు మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే రుచి ఉండడంతో ఎక్కువ శాతం బీర్లు తాగాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా బీర్లు తాగడం వల్ల ఏదో తెలియని ఉత్సాహం వస్తుందని భావిస్తారు. అయితే బీర్లు తాగడం వల్ల డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. స్థాయికి మించి బీర్లు తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే వారానికి ఒక బీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఇంతకీ వారానికి ఒక బీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మద్యం వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని కొందరు వైద్యశాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. గతంలో రెండు పెగ్గులు మద్యం తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని చెప్పారు. కానీ ప్రస్తుత కాలంలో మద్యం ఎంత మొత్తంలో తీసుకున్నా.. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఇటీవల నిరూపించారు. అయితే చాలామంది ఇప్పటికే మద్యం కు అలవాటుగా మారిపోయారు. ఒకేసారి మద్యం మానేయడం కష్టతరం. అందువల్ల సాధ్యమైనంత త్వరగా మద్యానికి దూరం కావాలని చెబుతున్నారు.
కానీ మరికొందరు మాత్రం బీర్లు తాగడం వల్ల కొన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా వారానికి ఒక బీరు తీసుకోవడం వల్ల.. కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయని చెబుతున్నారు. వీళ్ళలో ఉండే ఆల్కహాల్ శాతం కిడ్నీలో ఉండే రాళ్లను కరిగిస్తుందని చెబుతున్నారు. బీర్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో కిడ్నీలో ఉండే రాళ్లు వెంటనే కరిగిపోతాయని అంటున్నారు.
Also Read: United Breweries Beers: ఎండాకాలం ముందే కటకట.. తెలంగాణలో ఇక ఆ బీర్లు దొరకవా?
వారానికి ఒక బీరు తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉందని అంటున్నారు. ఇలా బీరు తాగడం వల్ల చర్మం పై వచ్చే మృత కణాలు తగ్గిపోతాయని అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. దీంతో చిన్న వయసులోనే చర్మం ముడతలుగా మారిపోతుంది. అంతేకాకుండా మృత కణాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్య నివారణకు వారానికొక బీరు తీసుకోవాలని అంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చర్మం నిగారింపులా ఉంటుందని చెబుతున్నారు.
ఇక నిత్యం ఏదో ఒక ఒత్తిడితో ఉండేవారు వారానికి ఒక బీరు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా మారుతారని అంటున్నారు. ముఖ్యంగా గుండెకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. తీవ్ర ఒత్తిడితో కలిగిన వారు గుండె సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే బీరు తీసుకోవడం వల్ల మనసు ఉల్లాసంగా మారి గుండె వేగం తగ్గిపోతుంది.
ఇలా బీర్ల వల్ల ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. కానీ వైద్యులు మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తక్కువ మోతాదులో ఏది తీసుకున్న పర్వాలేదు అని మరికొందరు చెబుతున్నారు.
View this post on Instagram