Chapati with tea:ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ కాస్త స్పైసీగా ఉండాలని కొందరు.. లైట్ గా ఉండాలని ఇంకొందరు అనుకుంటారు. సాధ్యమైనంతవరకు ఉదయం తినే ఆహారం తేలికగా ఉంటేనే రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతారు. కానీ కొందరు టేస్టీగా ఉండాలని కొత్త కొత్త కాంబినేషన్లను చేర్చుకుంటారు. ఈ కాంబినేషన్ల ద్వారా టెంపరరీగా ఆహారం టేస్టీగానే ఉంటుంది. కానీ లాంగ్ లైఫ్ లో ఇది విపరీతమైన అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. కొందరు డిఫరెంట్ గా ఉండాలని టీ లో రకరకాల పదార్థాలను కలుపుకుంటూ ఉంటారు. ఇందులో చపాతి వేసుకుని తినడం కొంతమందికి అలవాటు. అయితే టీ లో చపాతి వేసుకుని తింటే కలిగే నష్టాల గురించి తెలిస్తే మరోసారి ఆ పని చేయరు.. ఇంతకీ ఆ నష్టాలు ఏంటంటే?
Also Read: మహేష్ బాబు కోసం అంత పెద్ద త్యాగం చేసిన రాజమౌళి…
టీ తాగడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఉదయం లేవగానే టీ తాగడంతో ఉత్తేజితలై రోజంతా చక్కగా పనిచేయగలుగుతారు. అయితే కేవలం టీ తాగడం వల్ల కొందరికి నచ్చదు. ఇందులో బిస్కెట్ లేదా ఏదైనా పదార్థం వేసుకొని తినాలని అనుకుంటారు. కొందరైతే ఇందులో చపాతీలు వేసుకుని మరీ తింటారు. ఇలా చేయడం వల్ల తినే పదార్థం టేస్టీగా మారుతుంది. అంతేకాకుండా బ్రేక్ ఫాస్ట్ లో దీనిని చేర్చుకొని ముగిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయంటే..
టీ లో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైన పాయిజన్ అనుకోవచ్చు. అయితే ఇది అధిక మోతాదులో ఉండడం వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. సాధారణంగానే టీ లో ఇది ఉండడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అందుకే కొందరు టీ తాగేముందు వాటర్ తీసుకోవాలని వైద్యులు చెబుతారు. అలాకాకుండా ఈ టి తో చపాతి లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
Also Read: రాజమౌళి సక్సెస్ సీక్రెట్స్ ఇవేనా.? మొత్తం వేరే ఉందిగా..?
చపాతీ శరీరానికి శక్తిని అందించిన ఇందులో పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణం కాదు. అటు టీ లో టానిక్ అనే పదార్థం కూడా శరీరంలో జీర్ణ క్రియను మందగిస్తుంది. ఇలాంటి అప్పుడు ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీ లో చపాతి కలిపి తినడం వల్ల ఎసిడిటీ సమస్య రావచ్చు. పేగుల్లో సమస్యలు వచ్చి త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఉదయమే కడుపులో ఆమ్లం తయారై ఉంటుంది. ఇదే సమయంలో ఈ రెండు పదార్థాలు తినడం వల్ల మరింత సమస్యగా మారి అలసటకు దారితీస్తుంది. ఇలా ప్రతిసారి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని కోల్పోవాల్సి వస్తుంది.
అందువల్ల ఉదయం ఇలాంటి ప్రయోగాలు చేయకుండా కేవలం పనులు లేదా తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ టీ తాగాలని అనుకుంటే అందులో చపాతి లాంటి పదార్థాలను వేసుకోకుండా ఉండడమే మంచిది.