Rajamouli success story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరసగా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రాజమౌళి (Rajamouli) మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా 100% సక్సెస్ రేట్ ను మైంటైన్ చేస్తున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…అయితే రాజమౌళి సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవాలని చాలామంది చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనం కూడా రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం…మొదట రాజమౌళి ఒక కథని డెప్త్ గా వచ్చేలా రాయిస్తాడు. దానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ని రాసుకుంటాడు. దాని వల్ల ప్రేక్షకుడికి ఎక్కడ లాజిక్కులు మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఆయన సక్సెస్ కి మొదటి సీక్రెట్…రెండోది కథలో ఎమోషన్ ను చాలా బాగా ఎలివేట్ చేస్తూ ఉంటాడు… ఇక విలన్స్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించి అంత పవర్ఫుల్ విలన్ ని ఎదుర్కోవడానికి హీరో ఇంకెంత పవర్ఫుల్ గా ఉన్నాడో దాన్ని ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ వస్తాడు…ఇక ప్రతి 15 నిమిషాలకు ఒకసారి భారీ ఎలివేషన్స్ ఇచ్చే విధంగా గ్రాఫ్ ని మెయింటైన్ చేస్తూ వస్తాడు.
Also Read: కుబేర’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..ఈ ప్రాంతాల్లో భారీ నష్టాలు తప్పలేదు!
ఇంటర్వెల్ లో ఒక హై బ్యాగ్ ఇచ్చి ప్రేక్షకుడిని సాటిస్ఫై చేస్తాడు. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో సినిమా మొత్తలో చూసిన దానికంటే హై వోల్టేజ్ బ్యాంగ్ ఇస్తాడు… ఇక ముఖ్యంగా సెకండాఫ్ లో ఎమోషన్ తో ప్రేక్షకుడిని కట్టి పడేస్తాడు. దానివల్ల సినిమా ప్రేక్షకుడు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
అనేలా ఆ సినిమాను డిజైన్ చేసి ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాడు…ఇక ఇవన్నీ పర్ఫెక్ట్ గా చూసుకుంటూ వెళుతున్నాడు కాబట్టే రాజమౌళికి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక అందువల్లే ఆయన చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకుడిని నిరాశపరచడం లేదు.మరి తోటి దర్శకులందరు కూడా ఈ ఫార్మాట్ ను ఫాలో అయితే మాత్రం ఈజీగా సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన అదే ఫార్ములాని వాడుతున్నాడు.
Also Read: మహేష్ బాబు కోసం అంత పెద్ద త్యాగం చేసిన రాజమౌళి…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. పాన్ వరల్డ్ లో ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్రేక్షకులను మెప్పించినంత గొప్పగా ఇప్పుడు వస్తున్న సినిమా ప్రపంచ ప్రేక్షకుడిని మెప్పిస్తుందా? లేదా అనేది ఇప్పుడు రాజమౌళి ముందు ఉన్న పెద్ద టాస్క్ అని తెలుస్తోంది…