Pan Card: ఒక వ్యక్తికి గుర్తింపును ఆధార్ కార్డు ఆధారంగా తెలుసుకుంటాం. లేదా ఓటర్ ఐడీ కార్డు ద్వారా తన వివరాలు గుర్తిస్తాం. కానీ ఇప్పుడు పాన్ కార్డు కూడా ఐడెంటిటీలో ప్రధానంగా ఉంటోంది. కొన్ని వ్యవహారాల్లో పాన్ కార్డు లేకుండా పనులు జరగవు. ముఖ్యంగా బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేసేదగ్గరి నుంచి రూ.50వేలకు పైగా డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తీసుకుంటున్నారు. కేవలం పురుషులే కాకుండా మహిళలు సైతం పాన్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది. అయితే పాన్ కార్డు వచ్చిన తరువాత అందులో ఎన్నో కొన్ని తప్పులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మహిళలు పెళ్లయిన తరువాత తమ అడ్రస్, ఇంటిపేరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ద్వారా మార్చుకోవచ్చు. అదెలాగంటే?
ప్రతి అమ్మాయికి పెళ్లయిన తరువాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు తమ తల్లిదండ్రుల ఇంటిపేరుతో కొనసాగి… ఆ తరువాత భర్త ఇంటిపేరుకు మారాల్సి వస్తుంది. ఈ తరుణంలో కొన్ని ముఖ్యమైన పత్రాల్లోని తన పేరును మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి ఇది తప్పనిసరి అయినప్పుడు వెంటనే ఆన్ లైన్ సర్వీస్ సెంటర్లను సంప్రదిస్తుంటారు. అయితే చాలా వరకు ఇలాంటి వి వెబ్ సైట్ల ద్వారా ఇంట్లోనే ఈజీగా పూర్తి చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.
అందుకోసం మొబైల్ లేదా సిస్టమ్ ఉంటే ముందుగా బ్రౌజర్ లోకి వెళ్లి www.tin.nsdl.com అని టైప్ చేయాలి. దీంతో ఆ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత ఇందులో ‘పాన్’ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇందులోకి వెళ్లాక ఛేంజ్ లేదా కరెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ పేజీ ఓపెన్ అయ్యాక అందులో Application Type అనే ఆప్షన్ ను ఎంచుకొని ఆ తరువాత చేంజ్ ఆర్ కరెక్షన్ అనే దానిని ఎంచుకోవాలి. ఆ తరువాత ఇక్కడ మీరు కావాల్సిన కరెక్షన్ చేసుకోవచ్చు. ఇందులోనే పోస్ట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది.
వివరాల్సిన సమర్పించి సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత పేమెంట్ ఆప్షన్ వస్తుది. పేమేంట్ చేసిన తరువాత మీకు వివరాలు సబ్మిట్ చేసినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసుకోవాలి. కనీసం రెండు నుంచి వారం లోపు మీరు మార్చుకున్న వివరాలకు సంబంధించి రిజిస్టర్ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఆ తరువాత ఇంటికి కార్డు వస్తుంది. ఒకవేళ ఇంట్లో లేకున్నా ఆ కార్డు పోస్టాఫీసు నుంచి తీసుకునే వెసులుబాటు ఉంది.