Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో పుష్ప 2 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందనే వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని అందరు భావిస్తున్నారు.
నిజానికి ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమాలో ఏ తప్పైతే చేశాడో ఇప్పుడు పుష 2 సినిమాలో కూడా అదే తప్పు చేస్తున్నాడని తెలుస్తుంది. ఆయన నాన్నకు ప్రేమతో సినిమాలో చేసిన తప్పేంటంటే నాన్న అనే కోర్ ఎమోషన్ అయితే బాగానే వర్కౌట్ అయింది. కానీ మధ్యలో ఉండే హీరోయిన్ ఎపిసోడ్ గానీ, చిన్న చిన్న ఎమోషన్ సీన్స్ కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పుష్ప 2 సినిమాలో కూడా కొన్ని ఎమోషన్స్ వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదంటూ చిత్ర యూనిట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్స్ అయితే అందుతుంది. ఇక పుష్ప సినిమాలో మేజర్ గా ఎమోషన్ వర్కౌట్ అయింది కాబట్టే సినిమా కూడా సెంటిమెంటల్ గా అందరిని బాగా ఆకట్టుకుంది.
మరి ఇప్పుడు ఈ సినిమాకి ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం మీదనే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజానికి సుకుమార్ చేసిన అన్ని సినిమాల్లో నాన్నకు ప్రేమతో సినిమాలో సెంటిమెంట్ అనేది అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. అందువల్లే ఆ సినిమా అవరేజ్ గా ఆడిందే తప్ప బ్లాక్ బస్టర్ హిట్ అవలేదు. ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ అనేది భారీగా వర్కౌట్ అయితేనే అది ఇండస్ట్రీ హిట్టు కొట్టగలదు అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు…
మరి ఈ సినిమాతో సుకుమార్ ఏ రేంజ్ లో తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో చూడాలి…ఇక ఈ సినిమా ఆగస్ట్ 11 వ తేదీన రిలీజ్ కి రెఢీ అవుతున్న క్రమంలో ఈ సినిమా కి పోటీ గా మరే సినిమా కూడా రావడం లేదు కాబట్టి ఆగస్ట్ 15 ని బాగా క్యాష్ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యం లోనే మేకర్స్ ఈ సినిమాని అప్పుడు రిలీజ్ చేస్తున్నారు…