Chanakya Niti- Problems: మన దేశంలో నీతికి సంబంధించిన విషయాలు మనకు ఎక్కువగా తెలియవు. దీంతో తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేసిన ఆచార్య చాణక్యుడు నీతికి సంబంధించిన విషయాలు ఎన్నో మనకు తెలియజేశాడు. తన నీతి శాస్త్రంలో మనుషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలా వ్యవహరిస్తారు అనే వాటిని విశదీకరించాడు. ఆచార్య చాణక్యుడు ప్రజల కోసం ఎన్నో విషయాలు తెలియజెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆచార్య సూచించిన మార్గాల్లో మనుషులు నడుచుకుని సరైన మార్గాల్లో వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు.

జీవితంలో ఎదురయ్యే కష్టాలను గురించి వివరణ ఇచ్చాడు. మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడో ఉండకూడదు. ఆకాశం వైపు చూస్తూ నడవకూడదు. నేలవిడిచి సాము చేయకూడదు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు సావధానంగా ఆలోచించాలి. తద్వారా తరుణోపాయం కనుగొనేందుకు ప్రయత్నించాలి. అంతేకాని ఏవో బాధలు చుట్టుముట్టాయని తల పట్టుకుంటే కుదరదు. బాధల్లో ఉన్నప్పుడు తదనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని సమస్యల నుంచి బయటపడేందుకు ఆలోచించుకోవాలి.
Also Read: Chandrababu- BJP: చంద్రబాబుకు బీజేపీ స్నేహహస్తం.. మొత్తబడుతున్న కేంద్ర పెద్దలు
మనిషి ఏదైనా సాధించాలంటే మొదట ఆరోగ్యవంతుడిగా ఉండాలి. అందుకు గాను మంచినీరు తీసుకోవాలి. కలుషితమైన నీటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన పూర్వీకులు చెరువులు, కుంటల్లో నీటినే తాగేవారు. కానీ దాన్ని ఫిల్టర్ చేసుకునే వారు. బట్టలో నుంచి నీటిని పోసి కలుషితమైన వాటిని వేరు చేసి సేవించేవారు. మనకు ఇప్పుడు ఫిల్టర్ చేసే పరికరాలు ఎన్నో ఉన్నాయి. దీంతో మంచినీరు తాగుతూ వ్యాధులు దరిచేరకుండా చేసుకోవడం మంచిది. ఆ దిశగా మనం ఆలోచించాలి. అప్పుడే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ఏ పని చేసినా ఇతరులతో పోల్చుకోకండి మనకు మదిలో మెదిలిన ఆలోచనలకు అనుగుణంగానే మనం ముందుకు పోవాలి. కానీ ఎవరినో కాపీ కొడుతూ వారి అది చేశారు. నేను కూడా చేస్తాను అంటే కుదరదు. మన ఆలోచనల నుంచి పుట్టిన వాటికే మనం న్యాయం చేయగలం. అంతేకాని ఇతరులతో పోల్చుకుని ఏం చేసినా అది విజయవంతం కాదు. మధ్యలో ఆగిపోవడం ఖాయం. అందుకే మన పనికి మనమే బాస్ కావాలి. మనకు ఎవరు కూడా మార్గనిర్దేశం చేసేవారు ఉండటం అనవసరం.
అబద్దాలు చెప్పడం వల్ల కష్టాల్లో పడతాం. నిజాలు దాచడం మంచిది కాదు. అబద్దంతో ఎప్పటికి అనర్థమే. దీంతో మన నడవడికలో నిజాయితీ ఉండాలి. నిజమే చెప్పాలి. అబద్ధాలు ఆడితే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడే ఆస్కారం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనల్ని ఎవరు కూడా నమ్మరు. అబద్ధాలు ఆడితే అంతే సంగతి అని గుర్తుంచుకోవాలి. అందుకే మనం మంచి ప్రవర్తనతో నడుచుకుంటేనే మనకు మంచి అనేది అలవడుతుంది. కానీ అబద్ధాలతో జీవితం గడపాలంటే కష్టాలే కొనితెచ్చుకునే ప్రమాదం ఉంటుంది.