Chanakya Niti Tips : ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు రకరకాల వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. కానీ కొంతమందితో మాత్రమే మనం బాగా కనెక్ట్ అవుతాము. అయితే కొంతమందితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. పొరపాటున కూడా కొందరితో స్నేహం చేస్తే మీ కొంప కొల్లేరు అవుతుంది అంటూ ఆయన తెలిపాడు. బాగా ధనం ఉన్న వ్యక్తులు అందరూ కూడా జ్ఞానికాలేరు. ఉన్నత పదవులలో ఉండి చాలామంది బాగా సంపాదిస్తారు. అటువంటి వారు కూడా కొన్ని సందర్భాలలో తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఇటువంటి క్రమంలో వీరిని మూర్ఖులుగా చెప్తారు. ఈ ఐదు లక్షణాలు ఉన్న వ్యక్తులు మూర్ఖులుగా పరిగణించబడతారు. తమకి తాము పొగుడుకుంటూ చాలా స్మార్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతారు కొంతమంది. అటువంటి వాళ్ళు నిజంగా మూర్ఖులు అని చెప్పాలి. ఎదుటివారి మాటలను అలాగే సలహాలను వినేందుకు వీరు ఇష్టపడరు. కాబట్టి పొరపాటున కూడా ఇటువంటి లక్షణాలు ఉన్న వారి సలహాలను తీసుకోకూడదు. వాళ్లు ఇతరులకు సలహాలు ఇచ్చినప్పటికీ వారిని ఎక్కువగా దూషించే స్వభావం కలిగి ఉంటారు. ఇటువంటి లక్షణం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిది.
Also Read : చాణక్యనీతి: జీవితంలో ఆనందం నిండాలంటే ఇలా చేయండి..
అలాగే కొంతమంది వ్యక్తులు చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఇతరులను అవమానిస్తూ ఉంటారు. వీళ్ళని కూడా సమాజం మూర్ఖులుగా చెబుతుంది. ఇటువంటి వ్యక్తులతో స్నేహం చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో ఇటువంటి వ్యక్తులకు తెలియదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండడం మంచిది. అలాగే కొంతమంది ఎదుటి వ్యక్తి ముందు తమను తాము పొగుడుకుంటారు. ఇటువంటి వారిని కూడా ఆచార్య చానిక్యుడు మూర్ఖులు అని అంటున్నారు. వీళ్ళు ఎదుటి వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడడానికి ఇష్టపడరు. సరైన విషయం చెప్పినా కూడా వీళ్లకు వినే ఓపిక ఉండదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉంటే చాలా బెటర్. కొంతమంది ఒక పని చేసే ముందు క్షణం కూడా ఆలోచించకుండా చేస్తారు.
ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా మూర్ఖులు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇటువంటి వారితో కూడా స్నేహం చేయకూడదు. కొంతమంది వ్యక్తులు ప్రతిసారి ఎదుటివారికి ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు కూడా మన చుట్టూ ఉంటారు.తమ తెలివితేటలను ప్రదర్శించడానికి ఇదే సరైన మార్గమని వాళ్లు అనుకుంటారు. కానీ వీరు కూడా మూర్ఖుల కిందే వస్తారు. ఇటువంటి వారి సలహాలను పాటిస్తే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ఇటువంటి లక్షణాలున్న వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి అంటూ ఆచార్య చాణిక్యుడు సూచిస్తున్నాడు.