Chanakya Niti Life: మానవుల జీవితానికి సంబంధించిన ఎంతోమంది మేధావులు తమ సూచనలు అందించారు. కానీ మౌర్య సామ్రాజ్యానికి చెందిన చాణక్యుడు చెప్పిన నీతులు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ కాలం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను పాటిస్తూ వస్తున్నారు. ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలను చాణక్యుడు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాడు. అయితే ఒక వ్యక్తి జీవితం బాగుపడాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ అదే వ్యక్తి జీవితం నాశనం కావడానికి రెండే రెండు విషయాలు కారణమని అంటున్నాడు. మరి ఆ రెండు విషయాలు ఏవో చూద్దాం..
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
ప్రతి మనిషిలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని బట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవచ్చు. అయితే ఒక మనిషికి ఉండే లక్షణం ఒక్కోసారి ఎదుటివారికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలంగా ఆ వ్యక్తికే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి లక్షణాల్లో కోపం ఒకటి. ఒక విషయం లేదా ఒక పని నచ్చనప్పుడు కోపం వస్తుంది. ఇలా రావడం మనిషిలో ఉండే సహజ లక్షణం. కానీ ఈ కోపం కట్టలు తెంచుకుంటే మాత్రం ప్రమాదమే అని అంటున్నాడు చాణుక్యుడు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయని అంటున్నాడు. ఒకసారి కోపం వచ్చినప్పుడు మనసులో నెగటివ్ ఆలోచనలు ఉత్పన్నమవుతాయని అంటున్నాడు. అయితే కోపం వచ్చినప్పుడు ఏదైనా ప్రశాంతంగా ఉండే వస్తువులను చూడడం లేదా.. నచ్చిన వ్యక్తులను చూడడం వల్ల ఆ కోపం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కోపం ఉన్నట్లయితే వారి అభివృద్ధికి ఇది ఆటంకంగా మారుతుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి.
మనిషికి ఉండే మరో ప్రధాన లక్షణం ఆశ. అయితే ఆశ లేకపోతే మనిషి అభివృద్ధి చెందలేడు. కానీ ఇది దురాశగా మారితే మాత్రం తన జీవితం నాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు. ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం సాధారణం. కానీ అతిగా సంపాదించడం కోసం తప్పులు చేయడం.. ఇతరులను నష్టపెట్టడం వంటివి చేస్తే మాత్రం చివరికి ఆ వ్యక్తి నాశనం అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు చెప్పాడు. ఆశ ఉంటుంది పరిమితంగా ఉండాలని.. ఒక స్టేజి దాటిన తర్వాత ఆశను వదులుకోవాలని చాణుక్యుడు చెబుతూ ఉంటాడు. దురాశ వల్ల ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవి చెడుగానే ఉంటాయి. దురాశ వల్ల సంబంధాలు దూరం అవుతాయి.. సమాజంలో చెడ్డపేరు వస్తుంది.
ఇలా ఈ రెండు విషయాలతో మనిషి జీవితం నాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు అని చానక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొనబడ్డాడు. అందువల్ల ఈ లక్షణాలు మనిషిలో ఉండడం సహజమే.. కానీ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల జీవితం ఆనందమయంగా మారుతుంది. అలా కాకుండా ఈ లక్షణాలతో ఉండటం వల్ల సమాజంలో చెడ్డపేరు రావడంతో పాటు వారి జీవితం ఏమాత్రం సంతోషంగా ఉండదు అని చాణిక్యనీతి పేర్కొనబడుతుంది.