Tourists Cities: ప్రపంచంలోని ప్రతి ప్రదేశానికి వెళ్లాలని చాలామందికి ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా కొందరు విహారయాత్రలో చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ప్రత్యేకంగా సమయం తీసుకుని ఉల్లాసంగా ఉండడానికి వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే కొందరు నేటి కాలంలో ప్రపంచ యాత్ర చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది? ఈ నేపథ్యంలో ట్రావెల్ ప్లస్ లీజర్ అనే మ్యాగజిన్ ఒక జాబితాను తయారు చేసింది. ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో ఎక్కువమంది సందర్శించిన టాప్ సిటీ లను పేర్కొంది. వాటి వివరాల్లోకి వెళితే..
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
అమెరికాలోని న్యూ మెక్సికో నగరం ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించిన సిటీగా ప్రత్యేకత సాధించుకుంది. మెక్సికో లోయలో ఉన్న ఇది 2,240 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ అనేక మ్యూజియంలు, సినిమా థియేటర్లో ఉన్నాయి. వీటిలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆంత్రో పాలజీ ప్రఖ్యాత చెందింది.
ఉత్తర థాయిలాండ్ లోని చియాంగ్ మయే అనే నగరం ప్రకృతి అందమైన దృశ్యాలతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ అనేక దేవాలయాలు, జాతీయ పార్కులు,. అలాగే రుచికరమైన వంటకాలు కూడా కనిపిస్తాయి. ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడిన వారిలో ఇది రెండో స్థానంలో ఉంది.
జపాన్లోని టోక్యో నగరం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ నగరంలో ఉన్న ఎత్తైన టవర్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే జపాన్ చక్రవర్తి అధికారిక నివాసం ఇంపీరియల్ ప్యాలెస్, మీజీ పుణ్యక్షేత్రం, అఖిహభార, శిబియా, ఉయోనో పార్క్ వంటివి ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటాయి.
థాయిలాండ్ లోని బ్యాంకాక్ కూడా పర్యాటకులకు ఇష్టమైన నగరంగా పేర్కొనబడుతోంది. ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్, వాట్ ఫోర్, వాట్ అరుణ్. చతు చెక్ వీకెండ్ మార్కెట్, కోసాన్ రోడ్, నైట్ లైఫ్ అందాన్ని గెలిపిస్తుంది. బ్యాంకాక్ లో ఏడాది పొడవునా వెచ్చగా ప్రేమగా ఉంటుంది. అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
భారతదేశంలోని జైపూర్ నగరం పర్యాటకులకు ప్రీతిగా మారింది. ఇక్కడున్న అమెర్ కోట, హవా మహల్, జై గడ్ కోట, సిటీ ప్యాలెస్, చాంద్ గౌరీ వంటి ప్రదేశాలు ఆకట్టుకుంటాయి.
వియత్నాం దేశంలోని ఒక అందమైన పట్టణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దాని పేరే హొయి ఆన్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించబడింది. ఇది పురాతన పట్టణం. అలాగే ఇక్కడ జపనీస్ వంతెన కూడా చూడడానికి అందంగా ఉంటుంది. లాంతర్లు ఆకర్షిస్తాయి.
జపాన్ లోని మరో అందమైన ప్రదేశం క్యోటో. ఇక్కడ సాంప్రదాయ జపనీస్ భవనాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో రెండువేల కంటే ఎక్కువగా దేవాలయాలు ఉంటాయి. వీటిలో కిం కాకు జీ, నిజ్ కోట ప్రసిద్ధి చెందినవి.
ఇండోనేషియా దేశంలోని ఉబుద్ పట్టణం ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేర్కొనబడుతుంది. ఇది బాలి ద్వీపంలో ఉంటుంది. ఇక్కడ సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు మనోహరమైన ప్రదేశాలు ఆకట్టుకుంటాయి.
ఇవే కాకుండా భారత దేశంలోని ముంబై, ఆగ్రాలు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఈ మ్యాగజిన్ పేర్కొంది.