Cockroaches Coffee: ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగనిదే కొందరికి మనసులో పట్టదు. కొందరైతే బెడ్ కాఫీ తోనే రోజును ప్రారంభిస్తూ ఉంటారు. టీ కంటే కాఫీ ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా కాఫీలో ఉండే కొన్ని పదార్థాలు శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే కాఫీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కొందరు పరిశోధనల ద్వారా బయటపెట్టారు. ఇది తీసుకోవడం వల్ల కొన్ని రోగాలను దూరం కూడా ఉంచుతుందని చెప్పారు. కాఫీలో కెఫిన్ తో పాటు టానిన్లు, స్థిర నూనెలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇది అనేక రకాల శక్తిని ఇస్తుంది అని అంటారు. అయితే ఇటీవల అమెరికాలోని FDA ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. దానిని చూసిన చాలామంది కాఫీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఏంటంటే?
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
అమెరికాలోని Food And Drug Administration (FDA).. ఆహార పదార్థాలపై పరిశోధనలు చేస్తూ ఉంటుంది. తాజాగా చేసిన ఓ పరిశోధన కాఫీ తాగేవారికి ఆందోళనలను కలిగిస్తుంది. ఈ సంస్థ చెప్పినది ఏమిటంటే.. కాఫీలో కొన్ని రకాల బొద్దింకలు కలిగి ఉన్నాయని తెలిపింది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా… కొన్ని విషయాలను బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కాఫీ ని తయారు చేసేటప్పుడు గింజలను అర పెడుతూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన గింజల్లోకి ఎన్నో రకాల బొద్దింకలు వచ్చి చేరుతూ ఉంటాయి. ఇవి అందులోనే కలిసిపోయి ఉంటాయని చెబుతున్నారు. ఇలా బొద్దింకలతో కూడిన పౌడర్ తయారవుతూ ఉంటుందని చెప్పారు. ఇలా ప్రతిరోజు తాగే వారిలో బొద్దింకల పౌడర్ కూడా కలుస్తుందని చెప్పడం అందరికీ షాక్ ఇస్తుంది.
సాధారణంగా కాఫీలో శక్తిని ఇచ్చే అనేక రకాల పదార్థాలు ఉంటాయి. టీ పౌడర్ కంటే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కెఫిన్ కూడా ఎక్కువగా ఉండడంతో మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా కాఫీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మధుమేహం నువ్వు తగ్గించడానికి కూడా కాఫీ ఒక రకమైన ఔషధంలా పనిచేస్తుందని కొందరు చెబుతున్నారు.
కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిశోధన అందరికీ ఆందోళన కలిగిస్తుంది. అయితే కొందరు చెబుతున్న ప్రకారం కాపీలో మాత్రమే కాకుండా ఎన్నో రకాల పదార్థాలు కలుషితం అవుతున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు కాఫీలో కలుస్తూ ఉండవచ్చని అంటున్నారు. అయితే ఇది శరీరానికి ఎంత మాత్రం ప్రమాదం కాదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమంది కాపీని ఎక్కువగా తాగుతున్నారని.. వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. కానీ కాఫీ తయారు చేసే సమయంలో మాత్రం కాఫీ గింజల్లో బొద్దింకలు కలుస్తాయి అని చెప్పడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.