Chanakya Niti Success: జీవితాన్ని గెలవాలంటే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాలి. ఆనందం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినా.. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం కుంగిపోవద్దు. పరిస్థితులను అర్థం చేసుకొని సమయానుకూలంగా వ్యవహరించాలి. అప్పుడే విజయాలు దరి చేరుతాయి. కొందరికి జీవితంపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో నిత్యం కష్టాలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారి కోసం అపర చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా కొన్ని విషయాలను చెప్పాడు. జీవితంలో అనుకున్న పనులను పూర్తి చేయాలంటే కొన్ని విషయాలను విడిచిపెట్టాలని అంటున్నారు. ముఖ్యంగా భయాన్ని పాలద్రోలడం ద్వారా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇంకా చాణక్య చెప్పిన కొన్ని అద్భుత విషయాల్లోకి వెళితే..
భవిష్యత్ గురించి ఆలోచన వద్దు:
జీవితంలో అందరికీ కష్టాలు వస్తాయి. కానీ కొందరు మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా భయాన్ని విడిచిపెట్టేవారే అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో అపజయాలు ఎదురైనప్పుడు నిరాశ చెందడం మానేయాలి. ఆ సమయంలో భవిష్యత్ గురించి ఆలోచించకుండా అప్పటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. అవసరమైన కష్టాలు తొలిగిపోయే వరకు ఓపిక పట్టాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది. అందుకోసం వెయిట్ చేయడం తప్ప ఆ సమయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది.
భయాన్ని వీడాలి:
చాలా మంది చిన్న కష్టం రాగానే భయపడిపోతుంటారు. భయం వల్ల ఏ పనిని పూర్తిగా చేయలేరు. అంతేకాకుండా భయంతో ఉన్న వారిలో ఆత్మ విశ్వాసం తక్కువగా ఉంటుంది. భయపడిపోవడం వల్ల శత్రువులు ఎక్కువగా పెరిగిపోతారు. దీంతో మానసికంగా కుంగిపోయి తీవ్ర వేదనకు గురికావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. ధైర్యమే కొన్ని విషయాలకు సరైన సమాధానం. ఎలాంటి పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఉండడం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారే ఛాన్సెస్ ఎక్కువ అని చాణక్య వివరించాడు.
ఆత్మవిశ్వాసం దెబ్బతినొద్దు:
ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు శత్రువుల గురించి ఎక్కువగా ఆలోచించాలి. ప్రత్యర్థి ఏ విధంగా మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతిసేందుకు ప్రయత్నిస్తున్నాడో గుర్తించాలి. ఇలాంటి సమయంలో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడం వల్ల ఎదుటి వారు వెనుకడగు వేయొచ్చు. మీరు సంతోషంగా ఉండడం ఇష్టం లేని వారు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఇలాంటి సమయంలో ఆత్మ విశ్వాసమే అసలైన ఆయుధం. ఆతమ్మ విశ్వాసంతో కూడినట్లు మీరు ధైర్యంగా కనిపిస్తే ఎదుటి వారు మీమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకుంటారు.