Chanakya Niti Success: మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ప్రస్తుతం మన ఆహార అలవాట్లు గతి తప్పుతున్నాయి. దీంతో ఆరోగ్యం దెబ్బ తింటోంది. చిన్న వయసులోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈనేపథ్యంలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మనం తీసుకునే ఆహారం మనకు నష్టాలే తెస్తోంది. కానీ మనం మన ఆహార అలవాట్లను మార్చుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో వ్యాధులకు నిలయంగా మారాల్సిన పరిస్థితి వస్తోంది.
ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలతో ఆనాడే మనిషికి కలిగే బాధల గురించి వివరించాడు. దాదాపు 400 ఏళ్ల క్రితం అతడు సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయంటే అతడికి ఎంత తెలివి ఉందో అర్థం చేసుకోవచ్చు. చాణక్యుడి మనిషి జీవితంలో ఎలాంటి వారికి దూరంగా ఉండాలో చెబుతాడు. వారికి దగ్గరగా ఉంటే మనకు కలిగే బాధలేంటో కూడా వివరించాడు.
అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు, కపట బుద్ధి గల స్నేహితుడు, తెలివి లేని విద్యార్థి గురించి చెప్పాడు. అవినీతి పరుడైన రాజకీయనాయకుడు తన స్వార్థం కోసం పనిచేస్తాడు. ప్రజలను పట్టించుకోడు. అలాగే కపట బుద్ధిగల స్నేహితుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయాలనే ఆలోచిస్తాడు. మందబుద్ధి గల విద్యార్థి ఉపాధ్యాయుడి పేరును చెడగొడతాడు. ఇలా ఈ ముగ్గురికి దూరంగా ఉండటే శ్రేయస్కరం అని చెబుతాడు.
చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తితో కూడా మనం స్నేహం చేయడం మంచిదికాదు. పాముకు కోరల్లో, తేలుకు కొండిలో విషం ఉంటుందని తెలుసు. కానీ దురుద్దేశాలు కలిగిన వ్యక్తికి ఒళ్లంతా విషమే. అలాంటప్పుడు అతడికి దూరంగా ఉంటేనే మనకు కష్టాలు రావు. మనం ఉండే చోటులో గౌరవం, ఉపాధి, చుట్టాలు లేని ప్రాంతంలో మనం ఉండటం సురక్షితం కాదని చెబుతాడు.
అవివేకితో మనం ఎంత చెప్పినా వ్యర్థమే. అతడు మారడు. మనల్ని ఇబ్బంది పెడుతుంటాడు. అందుకే అలాంటి వారికి కూడా మనం దూరంగా ఉండటమే మంచిది. లేకపోతే మన మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. జీవితంలో మనం ఎదగాలంటే మనకు ఓ సమూహం ఉండాలి. ఒంటరిగా మనం ఏం సాధించలేం. మనకంటూ ఓ టీం ఉంటే ఏదైనా సాధ్యమే. అంతేకాని ఒంటరిగా ఏదో సాధిస్తానని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అందుకే మనల్ని నమ్మిన వారిని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఇలా చాణక్యుడు ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే పై విధంగా నడుచుకోవాలని సూచించాడు.