YS Vijayamma – YS Sharmila : కూతరు షర్మిల కోసం వైఎస్ విజయమ్మ ఎంతో తపన పడుతున్నారు. ఇది వరకు ఆమె దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యగా ఎంతో గౌరవించబడేది. ప్రస్తుతం జగన్ కు తల్లిగా ఆమెకు అంతకు ముందున్న గౌరవం కాస్త సడలిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూతరు షర్మిల కోసం ఆమె ఎంతగానో తాపత్రయపడుతున్నారు. అన్న నుంచి సహకారం పూర్తిగా లేకపోవడంపై విజయమ్మ విచారం వ్యక్తం చేయడం కనిపిస్తూనే ఉంది.
ఏపీలో వైసీపీ అధికారం రావడానికి చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ఎంగానో శ్రమించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ కేసుల వల్ల జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జగన్ ఇరువురు బాసటగా నిలిచారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కుటుంబాన్ని వేధిస్తుందంటూ ఆరోపణలు చేశారు. రోడ్డుపై కూర్చొని నిరసనలు వ్యక్తం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల రాష్ట్రం మొత్తం తిరిగి సానుభూతిని సంపాదించిపెట్టారు.
ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో షర్మిల కీలకంగా మారుతుందని భావించారు. కానీ, అనూహ్యంగా ఆమె అన్న జగన్ కు దూరంగా జరిగింది. కుటుంబంలో ఏర్పడిన లుకలుకలు మొదలయ్యాయనే పుకార్లు వినిపించాయి. బాబాయ్ వివేకా హత్య కేసు విషయంలోను షర్మిల పలు ఆరోపణలు చేశారు. కుటుంబంలో విబేధాలను బలపరిస్తూ షర్మిల తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టేశారు. మొదట్లో ఇదంతా అన్న జగన్ కు తెలిసే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత పూర్తిగా జగన్ ఎడమోహంగా వ్యవహరిస్తున్నారని తేలిపోయింది.
తెలంగాణాలో పార్టీ పెట్టిన పాదయాత్ర చేపట్టిన షర్మిలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. బహిరంగ సభల్లోను అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే పలుమార్లు జైలుకు కూడా వెళ్లివచ్చారు. పలు కేసుల్లో కండీషన్డ్ బెయిల్ పై ఉన్నారు. తాజగా మరోసారి ఆమెను అడ్డుకుంటున్న పోలీసులపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విధులకు ఆటంకపరిచారని పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఆమెను చూసేందుకు వెళ్లిన విజయమ్మను పోలీసులపై దురుసుగా వ్యవహరించారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్నట్లయితే ఈ గొడవలన్నీ జరిగేవి కావని పలువురు అంటున్నారు. రాష్ట్ర విభజన కూడా జరిగేది కాదని చెబుతున్నారు. కుటుంబంలో లుకలుకలు కూడా అణగిమణగి ఉండేవని అంటున్నారు. వైఎస్ విజయమ్మ ఉన్నా, తండ్రి ఉన్న లెక్క వేరు. జగన్ కు అందలమెక్కించేందుకు కూడా విజయమ్మ అంతలా కష్ట పడలేదు. పరిస్థితి దిగజారలేదు. కానీ, కూతరు షర్మిల వెంటే ఉంటూ ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. కానీ, ఇటు జగన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం విచారకరం.
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.
Read MoreWeb Title: Ys vijayamma supporting her daughter ys sharmila
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com