Chanakya Niti: జీవితంలో కొన్ని పనులు చేయాలంటే ప్రతి వ్యక్తి ముందు, వెనకా ఆలోచిస్తారు. మరికొందరు ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకు సాగుతారు. అయితే కొందరు మాత్రం కొన్ని పనులు చేయడానికి సిగ్గు పడుతూ ఉంటారు. ప్రతి వ్యక్తికీ ఎంతో కొంత బిడియం ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. ముఖ్యమైన ఈ విషయాల్లో మాత్రం బిడియంగా ఉండే కడుపు మాడుద్ది అని చాణక్యుడు చెప్పాడు. జీవితం గురించి అనేక విషయాలు చాణక్యుడు చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ విషయాల్లో సిగ్గు ఉంటే వారికే నష్టం అని చెబుతున్నారు.
మానవజీవనానికి ఆధారం ఆహారం. ప్రతిరోజూ ఏదో ఒక రకమైన ఆహారం తీసుకోకపోతే బతకలేరు. అందరూ బతకడానికి తిండే తింటారు. కానీ కొందరు అందరి ముందు భోజనం చేయడానికి, కొన్ని పదార్థాలు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలా ఆహారం విషయంలో సిగ్గుపడితే కడుపు మాడుద్ది. దీంతో సరైన సమయంలో శరీరానికి ఆహారం దొరకక నీరసంగా తయారై ఏ పని చేయకుండా ఉంటారు. అందువల్ల తిండి విషయంలో అస్సలు చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు.
నేటి కాలంలో మనిషిని నడిపించేది డబ్బు. అది లేకపోతే జీవన మనుగడ కష్టం. ఎవరో ఏదో అనుకుంటారని కొందరు డబ్బు సంపాదించే విషయంలో సిగ్గు పడుతూ ఉంటారు. అలా బిడియం తో ఉన్నవారు ఏ పనీ చేయలేదు. దీంతో సరైన విధంగా ఆదాయం లేక కష్టాల పాలవుతారు. అందువల్ల ఎవరి గురించీ ఆలోచించకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా డబ్బు సంపాదించడానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నా పర్వాలేదని చాణక్యుడు చెప్పాడు.
డబ్బు అందరి వద్ద ఉండదు. కొందరికి ఎక్కువ అవసరాలు ఏర్పడుతాయి. దీంతో ఇతరుల వద్ద అప్పు తీసుకుంటారు. కానీ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే ఇలా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారిని అడగడానికి సిగ్గుపడతారు. వారు ఏదో అనుకుంటారని అడగడమే మానేస్తారు. ఇలా విడిచిపెడితే భారీగా నష్టం ఏర్పడుతుంది. వీరిని చూసి మరికొందరు డబ్బు ఇచ్చేవారు కూడా ఇవ్వకుండా ఉంటారు. అందువల్ల ఇచ్చిన అప్పును అడగడానికి అస్సలు సిగ్గు పడొద్దని చాణక్యుడు చెప్పాడు.