Chanakya Niti: మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలు..

మోసం చేయకూడదు.. ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ తప్ప మరొక స్త్రీని చూడకూడదు అంటారు చాణక్యుడు. భార్యను మోసం చేయడం పురుష లక్షణం కాదని.. ఆమెను సంతోషంగా చూసుకోవాలి కానీ.. ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదు అని తెలిపారు చాణక్యుడు.

Written By: Swathi, Updated On : March 23, 2024 11:50 am

Good Husband

Follow us on

Chanakya Niti: అన్ని బంధాల్లో కెల్ల భార్య భర్తల బంధం గొప్పది అంటారు. ఎవరో తెలియదు. ఎక్కడో తెలియదు. కానీ కట్టిన తాళి వల్ల కలిసి జీవితాంతం బతుకుతారు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే కష్టమైన, నష్టమైన కూడా జీవితాంతం కలిసే ఉండాలి అనుకుంటారు. పెళ్లికి ముందు అవారా అని పేరు సంపాదించిన యువకులు కూడా పెళ్లి తర్వాత బాధ్యతగా ప్రవర్తిస్తుంటారు. అంటే ఆ గొప్పతనం భార్యభర్తలది అని చెప్పవచ్చు. ఇక అయిన వారిని కాదనుకొని కొత్త ఇంటికి వస్తుంది అమ్మాయి. మరి భార్యగా వచ్చిన మీ భార్యను ఆనందంగా చూసుకోవడమే పురుష లక్షణం. ఇంతకీ గొప్ప భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి ఆచార్య చాణక్యుడు ఏం చెప్పారో కూడా ఓ సారి తెలుసుకుందాం.

మోసం చేయకూడదు.. ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ తప్ప మరొక స్త్రీని చూడకూడదు అంటారు చాణక్యుడు. భార్యను మోసం చేయడం పురుష లక్షణం కాదని.. ఆమెను సంతోషంగా చూసుకోవాలి కానీ.. ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదు అని తెలిపారు చాణక్యుడు.

సమయం ఇవ్వాలి.. డబ్బు సంపాదించాలి అనే ద్యాసలో కుటుంబాన్ని మర్చిపోకూడదు. పని, పని అంటూ కుటుంబానికి సమయం ఇవ్వకుండా ఉండడం మంచిది కాదు అంటున్నారు చాణక్యుడు. డబ్బు ఎంత ముఖ్యమో ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం కాబట్టి డబ్బు సంపాదించడానికి ఎంత సమయం కేటాయిస్తారో.. అందులో కొంచెం అయినా కుటుంబానికి సమయం ఇవ్వాలి అంటున్నారు చాణక్యుడు.

బాధ్యత ముఖ్యం.. కుటుంబాన్ని బాగా చూసుకోవడం ముఖ్యమే. కానీ విచ్చలవిడిగా ఖర్చు పెడితే రేపటి భవిష్యత్తు అంధకారం అవడం పక్కా అంటున్నారు చాణక్యుడు. భార్యపిల్లలను రేపటి రోజు కష్టపెట్టకుండా చూసుకోవాలి అంటే నేడు పొదుపు చేయాలి అని సూచిస్తున్నారు చాణక్యుడు.

భార్యను గౌరవించాలి.. వేతనం లేని పని చేస్తుంటుంది భార్య. ఆమెను చిన్నచూపు చూడడం.. అవమానించడం తగింది కాదు అంటారు చాణక్యుడు. భార్యభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఇల్లు ఇల్లాలు సంతషంగా ఉంటారని వివరించారు చాణక్యుడు. చిన్న చిన్ప తప్పులను ఎత్తి ఆమె మనసును గాయపరచవద్దని సలహా ఇచ్చారు.