Chanakya Niti
Chanakya Niti : చాణక్య నీతి ప్రకారం జీవితానికి సంబంధించిన కొన్ని సూత్రాలను ఫాలో అవ్వడం వల్ల సంతోషంగా ఉంటుందని చాలామంది పేర్కొంటూ ఉంటారు. ఒక వ్యక్తికి ఎలాంటి జీవితం కావాలో కోరుకునే వారు చాణక్యనీతిని ఫాలో కావడం వల్ల అనుకున్నది సాధిస్తారు అని చెబుతారు. యవ్వనంలోకి రాగానే ప్రేమలో పడడం సహజం. అయితే ఆ ప్రేమను గెలిపించుకొని జీవితంలో సంతోషంగా ఉన్నవారే నిజమైన ప్రేమికులుగా నిలిచిపోతారు. అయితే ప్రేమ విషయంలో అమ్మాయి కంటే అబ్బాయి ముందు అడుగు వేస్తాడు. అమ్మాయిని ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ అమ్మాయిలు కొందరికి మాత్రమే పడిపోతారు. అలా పడడానికి అబ్బాయిల వద్ద ఉండే మంచి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
డ్రెస్సింగ్: పరిశుభ్రమైన దుస్తులు వేసుకున్న అబ్బాయిలు అంటే అమ్మాయిలు చాలా లైక్ చేస్తారు. ముఖ్యంగా ఫ్యాషన్ కంటే ఫార్మల్ డ్రెస్ వేసుకున్న వారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇలాంటి డ్రెస్ వేసుకునే వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని గుణం కలిగిన వారు మాత్రమే ఇలాంటి డ్రెస్ వేసుకుంటారని అమ్మాయిలు భావిస్తారు. అందుకే ఇలాంటి అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడిపోతారు.
Also Read : చాణక్య నీతి: గౌరవం తగ్గకుండా క్షమాపణలు ఎలా చెప్పాలి?
ఉద్యోగం: ఉద్యోగం పురుషలక్షణం అని అంటారు. అందువల్ల పురుషుడు ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి. ఆ పని చిన్నదా పెద్దదా అని చూడకుండా ఉద్యోగం చేసే వారిని అమ్మాయిలు ఎక్కువగా లైక్ చేస్తారు. ఉద్యోగం చేయకుండా ఆవారాగా తిరిగే తిరిగేవారికి అమ్మాయిలు పడిపోయినా ఆ ప్రేమ కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తిని బాధ్యత గల వ్యక్తిగా భావించి అలాంటి అబ్బాయిని ఎక్కువగా లైక్ చేస్తారు.
అర్థం చేసుకునే మనసు: ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం ఒక మంచి లక్షణం అని అమ్మాయిలు భావిస్తారు. ముఖ్యంగా తాము చెప్పేది విని.. తమ మనసును అర్థం చేసుకునే అబ్బాయిలను వారు అస్సలు విడిచిపెట్టరు అని చాణిక్య నీతి తెలుపుతుంది. ఇలాంటివారు అరుదుగా ఉంటారని.. వారు తారసపడితే వారిని పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటారు.
హ్యాపీనెస్: ఎవరికైనా సంతోషంగా ఉండాలని ఉంటుంది. అయితే కొందరు అబ్బాయిలు ఏదో కోల్పోయినట్టు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. మరికొందరు సీరియస్ గా పనులు చేస్తూ ఇతరులను పట్టించుకోరు. ఇంకొందరు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ సంతోషంగా ఉండగలుగుతారు. ఇలాంటి వారికి కష్టాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా లైక్ చేస్తారు. వీరితో జీవితం పంచుకుంటే సంతోషంగా ఉంటుందని భావిస్తారు.
అమ్మాయి ఫ్యామిలీ పై: అమ్మాయి ఫ్యామిలీ గురించి ఎక్కువగా పట్టించుకునే యువకుడి పట్ల వారు ఆకర్షితులు అవుతారు. వారి బాగోగులను చూసుకుంటూ.. వారికి అవసరమైన సేవలు చేసేవారు అంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా తమను ఇలాగే చూసుకుంటారని భావిస్తారు. అయితే అబ్బాయిని సెలక్షన్ చేసుకునే ముందు ఈ గుణాలతో పాటు అతను మంచివాడా లేదా అనే విషయాన్ని పూర్తిగా గ్రహించుకోవాలి. ఆ తర్వాతే అతనితో జీవితం పంచుకోవాలని చాణక్య నీతి తెలుపుతుంది.
Also Read : భార్య గురించి ఈ విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల.. ఎలాంటి అనర్ధాలు తెలుసా?