Children
Children : నేటి కాలంలో సంతానలేని సమస్యతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ కొందరికి పెళ్లి చేసుకోగానే సంతానం కలుగుతుంది. అయితే పుట్టిన పిల్లలు అల్లరితో కొందరు ఎగలేకపోతుంటారు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలని ఉద్దేశంతో కొందరు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు కోపంతో చెప్తే.. మరికొందరు కొడుతూ తిడుతూ చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి అర్థం కాకుండా పోయి వారి ప్రవర్తన వింతగా మారుతుంది. దీంతో భవిష్యత్తులో వారు చెడుదారులు పట్టే అవకాశం ఉంది. అందువల్ల పిల్లల పెంపకం విషయంలో కాస్త సంయమనం పాటించాలి. అంతేకాకుండా కొన్ని సూత్రాలతో వారిని మచ్చిక చేసుకోవాలి. అవేంటంటే?
Also Read : పిల్లలను ముద్దు పెట్టుకుంటున్నారా? జాగ్రత్త
పిల్లలు తాము ఏదో చెప్పాలని ఆశిస్తూ ఉంటారు. కానీ కొందరు తల్లిదండ్రులు వారిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. దీంతో వారి మనసు నిరాశతో నిండి ఉంటుంది. వారు చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు.. భవిష్యత్తులో వారు కొన్ని విషయాలను కూడా ఓపెన్ అవలేరు. అందువల్ల వారిలో ఎలాంటి విషయాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి.
పిల్లలు చిన్నప్పటినుంచే కొన్ని విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో మనకు తెలియకుండానే కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని ప్రశంసిస్తూ ఉండాలి. వారిని మెచ్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో మరికొన్ని పనులు చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే తప్పుడు పనులు చేసినప్పుడు వాటి వల్ల ఎలాంటి అనార్ధాలు జరుగుతాయో తెలపాలి. అంతేగాని తప్పుడు పనులపై కోపాడడం లేదా కొట్టడం కానీ చేయొద్దు.
పిల్లలు చేసే కొన్ని పనులకు కొట్టాలని అనిపిస్తుంది. దీంతో కొందరు కోపాన్ని తట్టుకోలేక పిల్లలపై దాడి చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల వారిలో తల్లిదండ్రులపై వ్యతిరేక భవనం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే వారిని కొట్టడం గానో లేదా కోపంగానూ కాకుండా తెలివైన దారిలో వారికి అసలు విషయాన్ని చెప్పండి. దీంతో వారిలో ఆలోచన శక్తి పెరిగి ముందు ముందు తప్పు చేసే ముందు ఆలోచిస్తారు.
చిన్నపిల్లలు అన్నాక ఏవో ఒక తప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాటిపై ఎక్కువగా నిందలు వేయకుండా.. ఆ తప్పు గురించి పూర్తిగా తెలపండి. అలాగే వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో కూడా వివరించాలి. ఇలా చేయడం వల్ల వారు తప్పు వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో తెలుసుకుంటారు.
ఒక్కోసారి పిల్లలు చేసే పనుల వల్ల చాలా కోపం వస్తుంది. దీంతో ఏమాత్రం ఓపిక లేకుండా వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయాల వల్ల పిల్లల జీవితాలపై ప్రభావం పడుతుంది. అయితే పిల్లలు ఏదైనా తప్పుడు పనులు చేసినప్పుడు ఒకరోజు ఆలోచించండి. కోపాన్ని తగ్గిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అప్పుడు ఆలోచించాలి. కోపంలో తీసుకుని నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
Also Read : ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి.