Chanakya Niti: అపర చాణిక్యుడు రాజకీయవేత్త గాని కాకుండా మనుషుల జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. ఒక మనిషి తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కొన్ని అలవాటను కచ్చితంగా ఉంచుకోవాలని తెలియజెప్పాడు. అలాగే సమాజంలో గుర్తింపు పొందాలన్నా.. ఇతరులతో మెరుగైన సంబంధాలు మెరుగుపరచుకోవాలన్న కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చాణక్యనీతి తెలుపుతుంది. డబ్బు ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే ఇతరులతో ప్రవర్తన బాగుంటేనే వారితో సత్సంబంధాలు ఉంటాయని.. లేకుంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చాణుక్య నీతి చెబుతుంది. ఇంతకీ ఎటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఎవరిని కష్ట పెట్టొద్దు?
చాణక్య నీతి ప్రకారం వృద్ధులు లేదా పెద్దలను గౌరవించాలి. వారిని అకారణంగా లేదా ఏ ఇతర కారణాలవల్ల వారిని కష్టపెడితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబుతుంది. ఎందుకంటే ఒక ఇంటికి పెద్దలు మాత్రమే అన్ని రకాలుగా శ్రేయస్సును కోరుతూ ఉంటారు. వారిని కష్టపెట్టడం వల్ల వారి మనసు బాధపడుతుంది. దీంతో వారు బాధపడితే ఇల్లు కూడా సంతోషంగా ఉండదని చెబుతున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వృద్ధులు లేదా ఇంట్లోని పెద్దవారిని గౌరవించాలని చాణక్య నీతి చెబుతుంది.
మహిళలను కూడా గౌరవించాలని చాణక్యనీతి పేర్కొంటుంది. ఎందుకంటే ఒక ఇంటికి ఇల్లాలే ప్రధానంగా భావిస్తారు. ఇంట్లోని అన్ని విషయాలు ఆడవారికే తెలిసి ఉంటాయి. అయితే వారిని కష్టపెట్టడం వల్ల లేదా బాధ పెట్టడం వల్ల వారి మనసు బాధపడుతుంది. దీంతో వారు చేసే పనుల్లో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లోనే ఆడవారు సమస్యలు ఎదుర్కొంటే ఇల్లు మొత్తం దరిద్రం తాండవిస్తుంది అని చాణిక్య నీతి పెరుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారిని గౌరవించాలని.. వారిని కష్టపెట్టకుండా చూడాలని అంటున్నారు.
ఒక వ్యక్తి ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యము. గురువు చేసిన బాటలోనే శిష్యుడు నడుస్తూ ఉంటాడు. అయితే శిష్యరికం పొందిన వారు గురువును ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకూడదు అని చాణిక్యనీతి చెబుతుంది. గురువు బాధపడటం వల్ల శిష్యులకు ఎప్పటికైనా నష్టమేనని తెలుపుతున్నారు. ఎందుకంటే తనకు జీవితాన్ని ఇచ్చిన గురువు బాధపడడం వల్ల ఆ వ్యక్తి ఎంత ఉన్నత స్థితికి వెళ్లిన వ్యర్థమేనని అంటున్నారు. అందువల్ల చాణిక్య నీతి ప్రకారం గురువులను ఎప్పటికీ బాధ పెట్టొద్దు.
కొంతమంది వ్యాపారం లేదా ఇతర పనులు చేసేవారు తమకింద పని మనుషులను నియమించుకుంటారు. అయితే వీరిని ఆకారణంగా లేదా కక్షతో బాధపెట్టడం వల్ల వారు ఎంతో దుఃఖపడతారు. ఇలాంటి వారిని బాధ పెట్టడం వల్ల ఎప్పటికీ సంతోషంగా ఉండలేరని చాణక్యనీతి తెలుపుతుంది. పనివారిని బాధ పెట్టడం వల్ల వారు ఇంటి విషయాల్లో సరిగ్గా ఉండలేరు. దీంతో ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని చాణక్య నీతి తెలుపుతుంది. అంతేకాకుండా తోటి వారితో కూడా ఎప్పుడు సంయమనం పాటిస్తూ వారితో ఆనందంగా జీవించాలని చాణక్యనీతి పేర్కొంటుంది.