Star Actor: ఇప్పటివరకు కెరియర్ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులను అలాగే కష్టాలను ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిన వీళ్ళు ప్రస్తుతం అత్యధిక పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతు రియల్ లైఫ్ లో కూడా హీరోస్ గా మారుతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నటుడు కూడా ఈ జాబితాలో ఒకరు. ఎంతో కష్టపడి సినిమా రంగంలో స్టార్డం సంపాదించుకున్న తారలు చాలామంది ఉన్నారు. పుట్టినప్పుడు పేదరికంలో ఉండి తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటున్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వరుసగా అవకాశాలు అందుకొని హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న తారలలో కొందరు మాత్రమే తమ సంపాదించిన డబ్బులు కొంత భాగాన్ని పేదలకు విరాళంగా అందిస్తున్నారు.
ఇటువంటి వాళ్ళు నిజజీవితంలో కూడా హీరోలుగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు. అందులో ఈ సీనియర్ హీరో కూడా ఒకరు అని చెప్పొచ్చు. ఈ స్టార్ హీరో ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే ఏలారు. ఈ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ షరాఫ్. గత నలభై ఏళ్ల నుంచి జాకీ షరీఫ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటుడుగా రాణిస్తున్నారు. హిందీ తో పాటు ఇతను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అలాగే మరాఠీ తో సహా మొత్తం 13 భాషలలో ఇప్పటి వరకు 250 కి పైగా సినిమాలలో నటించి నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరో గానే కాకుండా ఎన్నో సినిమాలలో విలన్ గా కూడా కనిపించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. జాకీ షరాఫ్ ముంబైలోని డీన్ పట్టి వాల్కేశ్వర్ ప్రాంతంలో పేద కుటుంబంలో జన్మించారు. అప్పట్లో అతని కుటుంబం కేవలం ఒక గదిలోనే నివసించేవారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాకీ షరాఫ్ అప్పట్లో తన ఇల్లు చాలా ఇరుకుగా ఉండేదని, రాత్రిపూట ఇంట్లో ఎలుకలు తన చేతి వేళ్లను కొరికేవని, అలాగే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 11వ తరగతిలోనే చదువు మానేసి తాను చిన్నచిన్న ఉద్యోగాలు చేశానని చెప్పుకొచ్చారు.చిన్నప్పటినుంచి కష్టాలు చూసిన జాకిషరాఫ్ తాను ఎలాగైనా ధనవంతుడు కావాలని కలలు కనే వారట.
ఈ క్రమంలో వంట పని నుంచి సేల్స్ మాన్ వరకు ఏ చిన్న పని దొరికినా కూడా చేసేవారట. అప్పట్లో ఒకరోజు అతనిని ఎవరో బస్టాప్ లో చూసి సినిమాలో పాత్ర పోషించమని చెప్పడంతో జాకీ షరాఫ్ జీవితం పూర్తిగా మారిపోయింది. సుభాష్ ఘయ్ నటించిన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో రాత్రికి రాత్రే బాలీవుడ్ స్టార్ గా మారిపోయారు జాకిషరాఫ్. జాకీ షరాఫ్ ముంబైలోనీ దాదాపు 100 కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు. అలాగే పేద కుటుంబాలకు వైద్య ఖర్చులకు సహాయం చేసేందుకు నానావతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా వాళ్ల కోసం ఒక ఎకౌంటు కూడా నిర్వహిస్తున్నారు. తనకు వచ్చిన ఆదాయంలో సగం జాకీ షరాఫ్ పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ముంబైలో ఉంటున్న ప్రతి బిచ్చగాడి దగ్గర ఈ రియల్ హీరో నెంబర్ ఉంటుంది. ఆకలితో ఉండే వీధి పిల్లలు ఎప్పుడైనా కూడా అతనికి ఫోన్ చేయవచ్చు.
View this post on Instagram