Chanakya Niti on Friendship: మంచి వారి స్నేహమే మనకు శ్రీరామరక్ష. చెడ్డవారి స్నేహం మనకు చేటు తెస్తుంది. అతడి స్వభావం మనకు కూడా అలవడుతుంది. దీంతో మనకు కూడా మెల్లమెల్గగా చెడ్డ పేరు రావడానికి కారణమవుతుంది. నీస్నేహితువెవరో చెప్పు నీవెలాంటివాడివో చెబుతాను అంటారు. అంటే మనం చేసే స్నేహంలోనే చెడు అనేది ఉంటే దానికి దూరంగా జరగడమే ఉత్తమం. చెడ్డ వారి స్నేహంతో మనకు ఎప్పటికి కూడా కీడే జరుగుతుంది. కానీ ఎవరు కూడా దీన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోరు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమే. ఎందుకంటే మన ఎదుగుదలలో స్నేహితులదే కీలకపాత్ర కావడం విశేషం. చెడ్డవారి సాంగత్యంలో మనకు చెడ్డపేరే వస్తుంది. పదిమంది చెడ్డవారితో తిరిగితే నీకు కూడా చెడు లక్షణాలే అలవడతాయి. నలుగురు మంచివారితో కలిస్తే నీకు అన్ని మంచి అలవాట్లే వస్తాయి. అందుకే చెడ్డవారి స్నేహం అంత మంచిది కాదనే అభిప్రాయం ఆచార్య చాణక్యుడు వ్యక్తం చేశాడు. తన నీతిశాస్త్రంలో దీనికి సంబంధించిన పలు సూచనలు చేశాడు.

చాణక్యుడి ీతి ప్రకారం చెడు ప్రదేశాలలో నివసించవద్దు. అంటే చెడ్డవారు ఎక్కువగా ఉండే చోట్ల ఉంటే అకస్మాత్తుగా మనకు కూడా చెడు పేరే వస్తుంది. మనల్ని కూడా చెడ్డ వారి కిందే జమకడతారు. దీంతో మన పరువు ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుకే చెడు ప్రదేశాలలో నివాసం అంత మంచిది కాదు. దీంతో ఎప్పటికైనా మన పేరు నాశనం అవుతుంది. మనల్ని కూడా చెడ్డవారిగానే అంచనా వేస్తారు. అది స్థల ప్రభావం. మంచి వారు ఉండే ప్రాంతాలలో నివసిస్తేనే మనకు కూడా మర్యాద లక్షణాలు అలవడతాయి. మనం నివసించే ప్రాంతాలను కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి.
Also Read: Divya Vani TDP : టీడీపీలోని ఆడవాళ్ల ఆర్తనాదాలు బయటపెట్టి పరువుతీసిన దివ్యవాణి
చెడు స్వభావం గల వారితో స్నేహం చేస్తే అంతేసంగతి. మనకు జరగాల్సిన కీడు జరిగిపోతోంది. ఎందుకటే చెడ్డ వారిలో అవే లక్షణాలు ఉంటాయి కానీ మంచివి కావు. దీంతో వారితో సంచరిస్తే మనకు కూడా అవే అలవాట్లు వచ్చి తీరుతాయి. దీంతో మనకు మన ప్రమేయం లేకుండానే చెడ్డవాడు అనే బిరుదు సొంతం అవుతుంది. అందుకే చెడు వారితో తిరగడం కాని వారితో స్నేహం చేయడం కాని చేయరాదు. వారికి దూరంగా ఉంటేనే మనకు మేలు జరుగుతుంది. దీనికి మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. వారిని దూరంగా ఉంచడమే మనం చేయాల్సిన పని అని గుర్తుంచుకోవాలి.

చాకచక్యం లని వారితో ఉండటం కూడా అంత శ్రేయస్కరం కాదు. అతడి మందబుద్ధితో మనకు అనర్థాలే వస్తాయి. సమయస్ఫూర్తి లేని వ్యక్తి ఏమీ సాధించలేడు. అతడితో కలిసి తిరిగితే మనకు కూడా మందబుద్ధి అలవడుతుంది. దీంతో మనం ఏ విషయాన్ని అయినా కూలంకషంగా ఆలోచించలేం. ఏ నిర్ణయం తీసుకోలేం. దీంతో మనకు చెడు జరుగుతుంది. అందుకే వీరితో కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. వారి దరి చేరి మనం కష్టాలు కొనితెచ్చుకోవద్దు. మంచి వారితోనే మన మనుగడ మంచిగా ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా సాగుతుంది. అందుకే ఎప్పటికి కూడా చెడ్డవారితో స్నేహం చేయడం శ్రేయస్కరం కాదు. వీటిని గుర్తుంచుకుని మనిషి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్పన అవసరం ఉందని చాణక్యుడు బోధిస్తున్నాడు.
Also Read:Balayya Sensational Comments On F3: F3 మూవీ పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్
[…] […]