Chanakya Niti: నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని పెద్దలు చెబుతారు. అంటే ఎదుటివారితో మంచిగా మాట్లాడితే వారు జీవితాంతం స్నేహంగా ఉంటారని వీటి అర్థం. అంటే మాటే ఎన్నో బంధాలను కలుపుతూ పోతుంది. ఒక మాట ద్వారా ఎంతో పెద్ద సహాయం చేసిన వారు అవుతారు. అయితే అన్ని వేళలో మాట ప్రధానం కాకుండా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మంచిగా మాట్లాడితేనే స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో.. కొందరు వ్యక్తులతో అసలు మాట్లాడకపోవడమే మంచిది అని అపరా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. చాణక్యుడు ఆ కాలంలోనే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వాటిలో కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది అని చెప్పాడు. మరి ఏ సమయంలో మౌనంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
మనిషికి ఉండే లక్షణాలలో కోపం ఒకటి. గుండె కొట్టుకోవడం వేగం అయినప్పుడు.. రక్త ప్రసరణ వేగం అందుకుంటుంది. ఇలాంటి సమయంలో కోపం వస్తుంది. కోపం వల్ల కొన్ని సమయాల్లో మేలే జరిగినా.. చాలా సందర్భాల్లో నష్టమే జరుగుతుంది. ఎందుకంటే కోపం ఉండడం వల్ల సమాజంలో గుర్తింపును కోల్పోతారు. అయితే కోపం వచ్చినప్పుడు మనిషి మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే కోపం ఉన్న సమయంలో తప్పుడు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలా మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తితో సంబంధాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంతవరకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండి ఆ తర్వాత ఆలోచించడం నేర్చుకోవాలి.
కొందరు లోకజ్ఞానం తెలియని వారు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారితో తక్కువగా మాట్లాడడమే మంచిది. ఎందుకంటే వారితో మాట్లాడడం వల్ల జ్ఞానం ఉన్నవారు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జ్ఞానం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. వారితో వాదన పెట్టుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. వారితో వాదన పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల వారి విషయంలో మాటలు తక్కువగానే ఉండాలి.
ఉద్యోగులు లేదా కొన్ని ప్రదేశాల్లో అధికారం చె లాయించే వారితో తక్కువగా మాట్లాడడమే మంచిది. ఎందుకంటే అధికారం వారి చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు వారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి వారితో ఎక్కువగా మాట్లాడటం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారం చలాయించేవారు తమకు నచ్చని వ్యక్తులను నష్టపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఏదైనా మాట పొరపాటు కాకుండా ఉండడానికి తక్కువగా మాట్లాడడమే మంచిది.
కొందరు వ్యక్తులకు వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో మద్యపానం, మాదకద్రవ్యం వంటివి కూడా ఉంటాయి. ఇలాంటి వారితో తక్కువగా మాట్లాడడమే మంచిది. మీరు ఎప్పుడు జీవితం ప్రయోజనం గురించి మాట్లాడరు. ఎప్పుడు తమ వ్యసనాల గురించే చర్చిస్తారు. దీంతో వీరితో మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అవసరం అనుకుంటే వారితో మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది.