Chanakya Niti: అపర చాణక్యుడు మనుషుల జీవితాలకు సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలను అందించాడు. ముఖ్యంగా ఎవరితో ఎలా ఉండాలో చెప్పాడు. మనుషుల్లో చాలా రకాలుగా ఉంటారు. కొందరు మంచివారు..మరికొందరు చెడ్డవారు.. ఇంకొందరు మూర్ఖులు.. అయితే ఒకరికి దానం చేసే విషయంలో చాణక్యుడు ఎలా ప్రవర్తించాలో తెలిపాడు. ‘పుణ్యం కొద్దీ పరుషులు.. దానం కొద్దీ బిడ్డలు.. ’అన్నారు. అందువల్ల కొందరు దయా గుణం ఉన్న వారు ఇతరులకు దానం చేయాలని అనుకుంటారు. ఇది ధన రూపంలో ఉండొచ్చు. లేదా వస్తు రూపంలో ఉండొచ్చు. దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. కానీ వీరికి మాత్రం అస్సలు దానం చేయొద్దని అపరచాణక్యుడు చెబుతున్నాడు. కొన్ని లక్షణాలు కలిగి ఉన్న వారికి దానం చేయడం వల్ల ఈ దానం వృథా అవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఇంతకీ ఎవరికీ దానం చేయొద్దంటే?
మనుషుల్లో ఆడవారు, మగవారు ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకరితో ఒకరికి అవసరం పడుతుంది. అయితే మంచి గుణం ఉన్న ఆడవారితో స్నేహం చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే సంస్కారంవంతమైన గుణం లేని వారికి దూరంగా ఉండడమే మంచింది. ఇలాంటి వారికి అత్యవసరం అయినా.. సాయం చేయడం వృథా అని చాణక్యుుడు అంటున్నారు. ఎందుకంటే వీరు దానం చేసిన వ్యక్తిని అస్సలు గుర్తు పెట్టుకోరు. అలాగే వీరికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం రాదని చాణక్య నీతి చెబుతుంది.
సమాజంలో మూడోరకం వ్యక్తులు మూర్ఖులు. వీరు మంచి వారిగా కాకుండా.. చెడ్డవారిగా కాకుండా.. తాము పట్టిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తారు. వీరి చర్యల వల్ల ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా వీరు ఎవరు చెప్పింది వినరు. తమ మాటే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారికి దానం చేయడం వల్ల వారు ఎదుటి వారి మంచితనాన్ని గుర్తించరు. పైగా దానం చేసిన వారిని హీనమైన మాటలతో నిందిస్తారు. వీరి గురించే గొప్పగా చెప్పుకుంటూ దానం చేసిన వ్యక్తి గురించి చెడ్డగా చెప్పే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు దానం చేయడం వేస్ట్ అని చాణక్యుడు అంటున్నారు.
కొందరు ఎప్పుడూ విచారకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. తమకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉందని ప్రస్తావిస్తారు. ఇలాంటి వ్యక్తికి దానం చేయడం వల్ల ఎదుటివారిని గుర్తించరు. ఒకవేళ ఏదైనా డబ్బు ఇస్తే వారు ఇచ్చిన వ్యక్తి గురించి ఎక్కడా ప్రస్తావించరుు. వీరికి దానం చేయడం వల్ల వారు పొందిన వస్తువులను ఉపయోగకరమైన పనులకు వాడరు. అందువల్ల వీరికి దానం చేయడం కన్నా వారికి దూరంగా ఉండడమే బెటర్ అని అపరచాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు.
ఇక ఎప్పటికీ ఇతర వ్యక్తులను బాధపెట్టే వ్యక్తులను.. హింసించే వారికి దానం చేయడం వృథా. వీరు దానం పొందినా వాటితో వికృత పనులు చేస్తారు. అందువల్ల వీరికి దానం చేయడం అనే విషయాన్ని మానుకోవాలి. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంద మంచిది అని చాణక్యుడు చెబుతున్నాడు.