Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతి వేత్త. తత్వవేత్త కావడంతో ఆయన సూచనలు మనకు పనికొచ్చేవిగా ఉంటున్నాయి. ఆర్థిక విషయాల్లో అతడి ఆలోచనలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. డబ్బు ఎలా ఖర్చు చేయాలి? ఎలా ఆదా చేయాలి? ఏ సందర్భంలో మితంగా ఖర్చు పెట్టాలి? ఏ విషయంలో మనం పొదుపు పాటించాల్సిన అవసరం లేదో కచ్చితంగా సూచించాడు.
దానం చేయడం
అపాత్ర దానం చేయకూడదు. ధనం ఉన్న వాడికి సాయం చేయకూడదు. పేదవారికి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పేదలకు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. మనం ఎంత దానం చేస్తే అంత మొత్తం మనకు వచ్చి చేరుతుంది. చెలిమె చల్లితేనే మళ్లీ ఊరుతుంది. అలాగే డబ్బు కూడా దానం చేసే కొద్ది పెరుగుతుంది. అందుకే దానం చేయడానికి వెనకాడకూడదు.
ఆరోగ్యం
మనిషి ఆరోగ్యం కోసం ఖర్చు చేయడానికి వెనకాడకూడదు. డబ్బు ఉన్నా వైద్యం చేయించుకుకోకపోతే అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది. ఆర్థికంగా కలిగినప్పుడు వ్యాధి చికిత్స చేయించుకోవడం మంచిదే. మనకు వచ్చిన వ్యాధి నయం చేసుకోకపోతే ఇబ్బందే. ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం తప్పు కాదు. అనారోగ్యాన్ని పెంచి పోషించుకోవడం తప్పు.
సహాయం
ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మంచిదే. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే వారు మనకు మంచి జరగాలని కోరుకుంటారు. పరిస్థితులను అర్థం చేసుకుని మనం సాయం చేయడం వల్ల ప్రాణాలు కాపాడితే అదే మనకు పుణ్యం. ఇలా ఆపదలను గుర్తించి సాయం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు.
సామాజిక సేవ
మనిషి సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు వినియోగించడం మంచిది. పాఠశాలలు, ఆస్పత్రి, నీటి సౌకర్యం కోసం పనులు చేయడం వల్ల మేలు కలుగుతుంది. ఇలా ప్రజల అవసరాలు తీర్చడం వల్ల సమాజానికి మేలు కలుగుతుంది. దీంతో మనం చేసే సేవకు గుర్తింపు లభిస్తుంది. ఇలా సామాజిక సేవ చేయడం వల్ల మనకు తృప్తి మిగులుతుంది.