Chanakya Niti : అపర చాణక్యుడు మౌర్య సామ్రాజ్యంలో రాజకీయవేత్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇదే సమయంలో మనుషుల జీవితాలకు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. ఒక వ్యక్తి తన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో? దేనిని అప్రధాన్యంగా చూడాలో? చాణక్య నీతి తెలుపుతుంది. సమాజంలో డబ్బు అందరికీ అవసరమే. కానీ ఇదే సమయంలో సంబంధాలు కూడా చాలా అవసరం. అయితే ఇదే సమయంలో డబ్బు ప్రదానమా? లేదా రిలేషన్షిప్ ప్రధానమా? అనేది కొందరు తేల్చుకోలేకపోతుంటారు. ఈ విషయంలో చాణక్యుడు కొన్ని విలువైన సూత్రాలు చెప్పాడు. అవేంటంటే?
Also Read : వేసవిలో నిమ్మరసం ఎక్కువగా తాగేస్తున్నారా?
మనిషి జీవితాన్ని డబ్బే నడిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం చాలా అవసరం. అయితే డబ్బు వల్ల కొన్ని అనర్ధాలు జరిగిపోతున్నాయి. డబ్బు సంపాదించాలన్న మాయలో పడి సంబంధాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇంట్లో వాళ్లను సైతం డబ్బు కోసం దూరంగా పెడుతున్నారు. కొందరైతే కట్టుకున్న భార్యను సైతం పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి సమయంలో డబ్బు ముఖ్యమా? లేక బంధాలు ముఖ్యమా? అనేది కొందరు సతమాతమవుతూ ఉంటారు.
ఒక వ్యక్తి జీవితానికి డబ్బు చాలా అవసరం. ఆ వ్యక్తికి డబ్బు లేనప్పుడు.. తన జీవితం నడవడానికి డబ్బు అవసరమైనప్పుడు.. సంబంధాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలని చాణిక్యనీతి తెలుపుతుంది. ఎందుకంటే తన జీవితం బాగుంటేనే తనతో సంబంధాలు ఎవరైనా ఏర్పరచుకుంటారు. అంతేకాకుండా జీవితం నడవడానికి కనీస డబ్బు కచ్చితంగా ఉండాలి. అందువల్ల ఈ విషయంలో డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వాలని చాణక్యనీతి తెలుపుతుంది.
కొంతమంది అవసరానికి మించి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే వీరికి ఇంకా కావాలన్న ఆశ ఉంటుంది. ఈ మాయలో పడి సంబంధాలను మర్చిపోతూ ఉంటారు. వాస్తవానికి అవసరానికి తగిన డబ్బు ఉన్నప్పుడు సంబంధాలు విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సంబంధాలు సరిగ్గా లేకపోతే జీవితం చిన్న భిన్నం అయిపోతుంది. కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉన్నప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఎంత డబ్బు సంపాదించినా వృధానే అవుతుంది. అవసరానికి మించి డబ్బు ఉన్నప్పుడు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు అనేది చాణక్య నీతి తెలుపుతుంది.
చాలామంది డబ్బు మాయలో పడి కట్టుకున్న భార్యని కూడా దూరంగా పెడతారు. కానీ ఈ విషయంలో డబ్బు కంటే ఇల్లాలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎందుకంటే జీవిత భాగస్వామి తోడుంటే ఎప్పటికైనా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించిన తర్వాత జీవిత భాగస్వామి కావాలనుకుంటే దొరకదు. బతకడానికి డబ్బు చాలా అవసరం. కానీ జీవిత భాగస్వామి విషయంలో డబ్బు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యనీతి తెలుపుతుంది.
అలాగే తల్లిదండ్రుల విషయంలోనూ డబ్బు కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని తెలుపుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులే లేకుంటే ఆ వ్యక్తికి జన్మ ఉండదు. అలాంటప్పుడు డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాంటి సమయంలో డబ్బు ఎంత ఎక్కువగా ఉన్నా వృధానే అవుతుంది. ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులకే ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యనీతి తెలుపుతుంది.