Chanakya Niti: ప్రతి వారు జీవితంలో ఎదగాలనే అనుకుంటారు. దాని కోసం నిరంతరం శ్రమిస్తారు. అనుకున్నది సాధించాలని తపన పడుతుంటారు. ఏదో మొక్కుబడిలా కాకుండా మంచి కార్యదీక్షతో ఉంటే ఏదైనా సాధ్యమే. జీవితంలో మంచి ఆర్థిక స్థితికి చేరుకుంటే విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. దీని కోసం ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలు బోధించాడు. కొన్ని మార్గాలు సూచించాడు. వాటిని పాటిస్తే మనం కూడా మంచి స్థితి చేరడం ఖాయం.
చదువు
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. చదువుకుంటేనే కదా మన తెలివితేటలు పెరిగేది. మనకు అన్ని విషయాలు తెలిసేది. చదువు రాకపోతే మనకు ఏదీ అర్థం కాదు. దేని మీద కూడా అవగాహన ఉండదు. దీంతో మనం జీవితంలో ముందుకు వెళ్లడం కష్టం. చాణక్యుడు బోధించిన నీతి సూత్రాల ప్రకారం మనిషికి విద్య అత్వవసరం. అది లేకపోతే మనుగడ సాగించడం కష్టం.
ప్రవర్తన
మన ప్రవర్తన కూడా మన స్థాయిని నిర్ధారిస్తుంది. మనం మంచి లక్షణాలు కలిగి ఉంటే మంచివాడిగా చెడు విధానాలు ఉంటే చెడ్డ వాడిగా చూపెడతాయి. చాణక్యుడి నీతి ప్రకారం మన విధానాలే మనకు ఉన్నతమైన స్థానాన్ని కట్టబెడతాయి. అడవికి రాజుగా ఉండమని సింహానికి ఎవరు చెప్పరు. దాని ఆకారమే రాజుగా నిర్ధారిస్తుంది. దాని హుందాతనమే తన పనితీరును మెరుగుపరుస్తుంది.
నీతి
ప్రతి మనిషికి నీతి ఉండాలి. చేసే పనుల్లో మంచి ఉంటే అదే నీతి. మన కీర్తిని ప్రభావితం చేసేది మన నీతినిజాయితీయే. నీతిగా ఉండేవాడిని అందరు గౌరవిస్తారు. అదే అవినీతితో ఉండేవాడిని అసహ్యించుకుంటుంది. నీతి అనేది మనకు అలంకారమే. మనలోని గుణాన్ని బయటపెడుతుంది. మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. దీన్ని నమ్ముకుంటే జీవితంలో ఎదగడం ఖాయం.
దానగుణం
ప్రతి మనిషిలో దానగుణం దాగి ఉంటుంది. ఇతరులకు దానం చేయాలనే గొప్ప సంకల్పం ఉండాలి. అలా అయితేనే పరోపకారంతో మనకు మంచి జరుగుతుంది. అంతేకాని నీకు నీవు బతకడం గొప్ప కాదు. పది మందిని బతికించడం గొప్ప. ఈ విషయం తెలుసుకుంటే మంచిది. మనిషిలోని దాతృత్వమే అదృష్టం కలిగిస్తుంది. అన్నింట్లో మనకు మంచి జరిగేందుకు కారణమవుతుంది.
సమయపాలన
జీవితంలో ఎదగాలంటే సమయం ముఖ్యం. మనం ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తేనే దానికి మనుగడ ఉంటుంది. అంతేకాని ఒక్కో సమయంలో చేయాల్సిన పని మరో సమయంలో చేస్తే దానికి విలువ ఉండదు. సమయాన్ని బట్టి మన పనులు కూడా మార్చుకుంటే మంచిది. అప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయి. సమయపాలన లేకుండా విచ్చలవిడిగా చేస్తే వాటికి విలువ ఉండదు. అవి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సమయపాలన అత్యంత ఆవశ్యకం అని గుర్తించాలి.