Chanakya Neeti
Chanakya Niti: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రం గురించి పలు విషయాలు తెలుపుతూ మౌర్య సామ్రాజ్యంలో గుర్తింపు పొందారు. ఇదే సమయంలో జీవితానికి సంబంధించిన కొన్ని నీతి సూత్రాలను అందించి వారి ఎదుగుదలకు తోడ్పడ్డారు. చాణిక్య నీతి సూత్రాలు చాలా మంది ఫాలో అవుతూ తమ జీవితాలను సార్ధకం చేసుకున్నారు. అలాగే ఒక వ్యక్తి డబ్బు సంపాదన గురించి.. ఖర్చుల గురించి.. కూడా చాణుక్యుడు పలు విషయాలను చెప్పారు. చాణక్య నీతి ప్రకారం డబ్బును సంపాదించడమే కాకుండా వాటిని పొదుపు చేయడంలో కూడా కొన్ని ప్రత్యేక సూత్రాలు పాటించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉన్న డబ్బులు రెట్టింపు చేయాలంటే కొన్నింటిని తప్పక పాటించాలని చెప్పారు. అవేంటో తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తికి సోమరితనం చాలా కష్టాలను తీసుకువస్తుంది. అలాగే ఒక వ్యక్తి డబ్బును రెట్టింపు చేయడానికి సోమరితనం అడ్డుపడుతుంది. ఏ వ్యక్తి అయినా తన ఆదాయాన్ని పెంచుకోవాలనుకునే సమయంలో కష్టపడుతూ ఉండాలి. సోమరితనంతో ఉండడం వల్ల ఉన్న డబ్బు కరిగిపోతుంది. ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు ఆ పనిని వెంటనే పూర్తి చేయడం మంచిది. దానిని వాయిదా వేయడం లేదా.. చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల డబ్బు రెట్టింపు కాకపోగా.. ఉన్న డబ్బు కరిగిపోతుందని చాణక్యుడు చెప్పాడు.
ఒక మనిషికి మంచి అలవాటు జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తుంది. ఇదే సమయంలో చెడ్డ అలవాటు జీవితాన్ని నాశనం చేస్తుంది. మనిషికి ఉండే చెడు అలవాట్ల వల్ల ఆదాయం కరిగిపోతుంది. ఇదే సమయంలో ఆదాయం రెట్టింపు చేయాలని అనుకునేవారు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మద్యం, అనవసరమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాటికి ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.
చాలామంది తమ ఆడంబరాలకు అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆదాయం పెంచుకోవాలని అనుకునేవారు ఇలాంటి ఖర్చులకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మితంగా ఖర్చు పెట్టడం వల్ల డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి అదనపు ఆదాయం లేకపోయినా ఖర్చులను పొదుపు చేయడం వల్ల డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి అని చాణక్యుడు చెప్పాడు.
ఆదాయం అధికంగా మారాలంటే సరైన విధంగా పెట్టుబడులు పెట్టాలని చాణుక్యుడు చెప్పాడు. కొందరు సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోవడం వల్ల ఆదాయం రాకపోగా నష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా పెట్టుబడి పెట్టే వాటిలో నష్టాలు వచ్చే సంస్థలు ఏవో ముందే తెలుసుకోవాలి. ఇప్పటికే నష్టాలు వచ్చినవి అయితే వాటిని ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
జీవితంలో దాన ధర్మాలు చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ దానాలు మితిమీరితే తీవ్ర నష్టాలు కలుగుతాయి. అవసరం మేరకు మాత్రమే దానాలు చేసి.. డబ్బులు పొదుపు చేసే అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయని చాణక్యుడు పేర్కొన్నారు.