Mehreen Pirzada: తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియో మనసు దోచేసింది. ప్రస్తుతం ఫోటోలో వైరల్ అవుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. పంజాబ్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మోడలింగ్ రంగంలో తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు యాడ్లలో నటించి బాగా పాపులర్ అయింది. 2016లో తెలుగు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. తన అందం, అభినయం పరంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే మొదటి సినిమాలో ఈ బ్యూటీ ని చూసినప్పుడు తెలుగు పరీక్షకులు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి మరొక కాజల్ అగర్వాల్ దొరికింది అని అనుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఆమెకు అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. టాలీవుడ్ లో నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగశౌర్య తదితర హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సూపర్ హిట్ సినిమాలు కూడా తన ఖాతాలో వేసుకుంది.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష..? కారణం ఏమిటంటే!
అంతా బాగుంది అనుకున్న సమయంలో ఈ బ్యూటీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమె హర్యానాకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ప్రేమలో పడింది. మీరు కుటుంబాల అంగీకారంతో ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ పెండ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. దాంతో అప్పటివరకు క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ అందాల తారకు ఒక్కసారిగా సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు ఆమెను హనీ అంటూ ముద్దు పేరుతో పిలుస్తారు.
ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఎఫ్ 2 హనీ మెహరీన్ పిర్జాదా. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు. చివరిసారిగా ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమాలో నటించింది. 2022 మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మెహరీన్ 2023లో స్పార్క్ అనే చిన్న సినిమాలో కనిపించింది. అదే ఏడాది మెహరీన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక కన్నడ సినిమా మాత్రమే ఉందని సమాచారం.