https://oktelugu.com/

Chanakya Niti: యవ్వనంలో ఈ అలవాట్లు ఉంటే మీ వృద్దాప్యం దారుణంగా గడుస్తుంది..

ప్రతి పనికి సిద్ధంగా ఉండటం గొప్పవారి లక్షణం. మీ పనిని సమయానికి చేయడం మరీ ముఖ్యం. ఇది జీవితంలో విజయావకాశాలను పెంచేలా చేస్తుంది. సోమరితనం వల్ల ప్రతిదీ ఇబ్బందిగానే తయారు అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 4, 2024 / 08:53 AM IST

    Chanakya Niti Problems

    Follow us on

    Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అందులో చాలా వరకు మంచిని పెంచేవే ఉన్నాయి. ఎలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏ నిర్ణయాలు మనిషి మంచిని పెంచుతాయి. ఏ విధంగా ఆలోచనలు ముందు భవిష్యత్తు ను ప్రభావితం చేస్తాయి వంటి చాలా విషయాలను ఆయన తెలిపారు. అంతేకాకుండా.. విజయవంతమైన జీవితం కోసం ఎన్నో సూచనలు చేశారు ఆచార్య చాణక్యుడు.. అందుకే.. చాణక్య నీతి విధానాలను నేటికీ అనుసరిస్తుంటారు ప్రజలు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో యవ్వనంలో చేయాల్సిన పనులను గురించి కూడా వివరించారు. కొన్ని తప్పటడుగులు వేయడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మరి చిన్నతనంలో చేయకూడని ఆ తప్పులు ఏంటో చూసేద్దాం.

    వాస్తవానికి పురుషులు, మహిళలు భవిష్యత్తులో ప్రభావితం చేసే ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు.. ఆ తప్పులు ఏంటి అనేది ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో క్లియర్ గా తెలిపారు. అందుకే వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూచి అడుగులు వేస్తుండాలి. అయితే వాస్తవానికి యవ్వనంలో చాలా పనులు చేయాలనే అభిరుచి అందరికీ ఉంటుంది. కాబట్టి తెలిసి కొన్ని.. తెలియక కొన్ని చేసే తప్పులు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు చాణక్యుడు.. యవ్వనంలో చేసే కొన్ని తప్పిదాలు మీ ఆయుష్షును తగ్గిస్తాయని తెలిపారు ఆచార్య చాణక్యుడు. ఇరవై సంవత్సరాల తర్వాత ఇలాంటి తప్పులు చేయవద్దు అంటున్నారు మరి అవేంటంటే?

    సమయం వృధా: సమయం చాలా విలువైనదిగా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఒక్కసారి వెళితే తిరిగి రాలేదు అనేది కాదనలేని వాస్తవం. అందుకే ఈ సమయాన్ని వృధా చేయవద్దు. సమయాన్ని వృధా చేసేవారు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే సమయపాలన కచ్చితంగా అవసరమయ్యే ఆయుధం.

    సోమరితనం: ప్రతి పనికి సిద్ధంగా ఉండటం గొప్పవారి లక్షణం. మీ పనిని సమయానికి చేయడం మరీ ముఖ్యం. ఇది జీవితంలో విజయావకాశాలను పెంచేలా చేస్తుంది. సోమరితనం వల్ల ప్రతిదీ ఇబ్బందిగానే తయారు అవుతుంది. ఏ పని చేయాల్సిన వచ్చినా సరే వాయిదా వేస్తుంటారు. సో పని మాత్రం అవదు.

    డబ్బు వృధా: డబ్బును తెలివిగా ఖర్చు చేయడం ఉత్తముల లక్షణం. డబ్బు ప్రాముఖ్యతను చిన్నవయసులో గుర్తిస్తే అది మిమ్మల్ని వృద్దాప్యంలో కాపాడుతుంది. భవిష్యత్తులో వచ్చే సంక్షోభాలలో డబ్బు అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే.. డబ్బు వృద్ధాను అరికట్టి.. పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం.

    కోపం: ఒక వ్యక్తి ఆలోచనా సామర్థ్యం.. అర్థం చేసుకునే సామర్థ్యం మొత్తం కూడా ఒక్క కోపంతో పోతుంది. కానీ ఇరవై ఏళ్ల తర్వాత స్పందించేటప్పుడు మాత్రం కచ్చితంగా ఆలోచించాలి. చిన్న వయసులోనే కోపతాపాలు ఎక్కువ వస్తుంటాయి. నియంత్రించడం అంత సులభం కాదు అంటున్నారు చాణక్యుడు. ఈ కోపాన్ని తగ్గించడానికి యోగా.. ధ్యానం చేయండి. కోపంతో చేసే పనులు భవిష్యత్తులో మిమ్మల్ని ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుంటాయి కాబట్టి జాగ్రత్త.