https://oktelugu.com/

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. కష్టాల సమయంలో ఈ 5 సూత్రాలు పాటిస్తే గట్టెక్కుతారు.. అవేంటి?

కష్టాలు లేని వ్యక్తి అంటూ ఉండడు.కానీ చిన్న కష్టాన్ని బూతద్దంలో చూడడం వల్ల ప్రతీది కష్టమే అనిపిస్తుంది.అయితే ఒక వ్యక్తి కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆ వ్యక్తి చేయాల్సిన మొదటి పని ‘ఓపిక పట్టడం’. వ్యక్తులు ఏదైనా కష్టం ఎదుర్కొన్నపుడు వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 2, 2024 / 03:50 PM IST

    Chanakya Niti

    Follow us on

    Chanakya Niti: ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే అతడు జీవించే వాతావరణ స్వచ్ఛంగా ఉండాలి. లేదా అతడు సన్మార్గంలో వెళ్లడానికి వెన్నంటూ ఓ గురువు ఉండాలి. మౌర్యుల కాలంలో చాణక్యుడు అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు తన అపారమైన తెలివితో రాజులకు మేధస్సును అందించి రాజ్యాన్ని విజయవంతంగా నడిపించగల బోధనలు చేశాడు. ఆ సమయంలో చాణక్యుడు చేసిన బోధనలు భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగపడాలని అప్పటి నుంచి కొందరు చాణక్య నీతి సూత్రాలను పాటిస్తున్నారు. చాణక్యుడు రాజ్యానికి సంబంధించి విలువైన సూత్రాలను అందించాడు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తాను ఎదుర్కొంటున్న సమస్యలు, బాధల నుంచి ఎలా బయటపడాలో కొన్ని సూత్రాల ద్వారా పేర్కొన్నాడు. చాలా మంది చాణక్య నీతి సూత్రాలను పాటించిన వాళ్లు తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఇదే సమయంలో చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటాడని, అయితే కొన్ని సూత్ారలను పాటించడం వల్ల ఆ వ్యక్తి సమస్యల వలయం నుంచి బయటపడుతాడని దారి చూపించాడు. ఆ విషయాలను పాటించితే కచ్చితంగా విజయం వారిదేనని చెప్పాడు. ప్రస్తుతం కాలంలో వ్యక్తులు ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయటపడడానికి ఎటువంటి మార్గాలు దొరకడం లేదు. అయితే చాణక్యుడు చెప్పిన ఈ 5 సూత్రాలను పాటిస్తే ఆ వ్యక్తి కష్టాల నుంచి విముక్తి పొందుతాడని కొందరు చెబుతున్నారు. ఇంతకీ ఆ 5 సూత్రాలు ఏంటి? వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

    కష్టాలు లేని వ్యక్తి అంటూ ఉండడు.కానీ చిన్న కష్టాన్ని బూతద్దంలో చూడడం వల్ల ప్రతీది కష్టమే అనిపిస్తుంది.అయితే ఒక వ్యక్తి కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆ వ్యక్తి చేయాల్సిన మొదటి పని ‘ఓపిక పట్టడం’. వ్యక్తులు ఏదైనా కష్టం ఎదుర్కొన్నపుడు వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది అంటారు. అందువల్ల ఇలాంటి సమయంలో కష్టాల నుంచి బయటపడడానికి ఎన్నో చెడు మార్గాలు కూడా కనిపిస్తాయి. వాటి జోలికి పోకుండా సహనంతో ఉండాలని చాణక్య నీతి చెబుతుంది.

    ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తికి డబ్బు సమస్య ఏర్పడిందని అర్థమవుతుంది. అటువంటప్పుడు ఆ వ్యక్తి ‘డబ్బును ఆదా’ చేయాలి. ఇలాంటి సమయాల్లో కొన్ని దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. అనవసరమైన హోదాలకు పోకుండా అత్యవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయాలి. అయితే కష్టాలు రాకముందు నుంచే డబ్బును ఆదా చేసినట్లయితే ఇలాంటి సమయంలో చిక్కులు ఉండవు.

    కష్టాల సమయంలో ఒక వ్యక్తి చేసే ప్రధాన బాధ్యత కుటుంబ సభ్యులను రక్షించడం. చాలా కటుంబాలు ఒకే వ్యక్తిపై ఆధారపడి ఉంటున్నాయి. అయితే ఆ వ్యక్తి కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా చిక్కుల్లో పడుతారు. అందువల్ల ముందుగా కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చిన తరువాత మిగతా కార్యక్రమాలు చేపట్టాలి.

    ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అయితే తనకు ఏ కష్టం రాదు అన్నట్లుగా ప్రవర్తించొద్దు. ఈ నేపథ్యంలో కష్టాల సమయంలో ఆదుకోవడానికి ముందుగానే కొన్ని ఆదాయ వనరులను సేవల్ చేసుకోవాలి. వీటిని ఇలాంటి సమయంలో వాడుకోవచ్చు. అయితే ఇది ఒక వ్యూహం ప్రకారం ఉండడం వల్ల ఇబ్బందులు ఉండవు.

    ఒక వ్యక్తికి మరో వ్యక్తే సాయం చేయగలడు. అందువల్ల బంధాలను పెంచుకోవడం చాలా అవసరం. కష్టాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఆదుకునే విధంగా అందరితో స్నేహపూర్వకంగా మెదలాలి. అసవరం లేకున్నా వారితో కమ్యూనికేషన్ ఉండాలి. దీంతో వారు ఆపద సమయంలో మీకు తోడు ఉంటారు.