Chanakya Niti Bad Things: సాధారణంగా మనుషులు తప్పులు చేస్తుంటారు. వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. మనం చేసే తప్పులే మనకు నష్టాలు తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు మనకు చాలా రకాలుగా తోడ్పడుతున్నాయి. మనం చేసే తప్పుల వల్ల మన జీవితం నరకప్రాయంగా మారుతుంది. బతికుండగా మనం చేసే చెడ్డ పనులే మనల్ని నరకానికి తీసుకెళ్తాయని చాణక్యుడు సూచించాడు.
కోపం
తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు. మనిషికి కోపం ఉన్నవారు దేన్ని సాధించలేరు. జీవితంపై నియంత్రణ ఉండదు. క్షణికావేశంలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల పలు పాపాలకు ఆస్కారం ఉంటుంది. మరణానంతరం నరకం అనుభవిస్తారని చాణక్యుడు సెలవిచ్చాడు. అందుకే మన జీవితంలో కోపాన్ని సరైన సమయంలో నియంత్రణ చేయకోతే ఇబ్బందులు తప్పవు.
మూర్ఖత్వం
తెలిసిన వాడికి చెప్పొచ్చు. తెలియని వాడికి చెప్పొచ్చు. కానీ తెలిసి తెలియని వారికి చెప్పడం వీలు కాదు. వాడే మూర్ఖుడు. మూర్ఖుడు తనకు తెలిసిందే వేదంగా చెబుతారు. మిగతా విషయాలు ఎవరికి తెలియవని అనుకుంటారు. కానీ మూర్ఖత్వంతో ఇతరులను బాధపెట్టే వారికి నరకం ఖాయం. మూర్ఖుడితో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాడికి సాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది.
ద్వేషం
మన దగ్గరి వారిపై ద్వేషం పెంచుకోవడం సబబు కాదు. ఇతరులను బాధపెడుతూ వారిపై ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. కానీ ప్రేమను మాత్రం పెంచదు. ప్రేమ ప్రేమను పెంచుతుంది కానీ ద్వేషంతో దేన్ని సాధించలేమని తెలుసుకోవాలి. అందరితో ప్రేమగా ఉండాలి కానీ పగతో ఉంటే ఏది కుదరదు.
దయ
నిరుపేదల పట్ల దయ చూపాలి. వారికి సాయం చేయాలి. అప్పుడే మనపై వారు ప్రేమగా ఉంటారు. ఇతరులపై ప్రేమ లేని వాడు నరకానికి పోవడం ఖాయం. మరణాంతరం కూడా మనకు మంచి పేరు రావాలంటే అందరిపై జాలి చూపాలి. దయతో ఉండాలి. అప్పుడే వారు మనల్ని గౌరవిస్తారు. ఇలా చాణక్యుడు అనేక విషయాల్లో మనం దయ కలిగి ఉండాలని చెబుతున్నాడు.
దుర్భాషలు
ఎదుటి వారిని ఎప్పుడు చెడు మాటలతో ఇబ్బందులు పెట్టకూడదు. ఇలా చేస్తే దుఖానికి దగ్గరవుతాం. ఇతరులను బాధలకు గురిచేస్తే మనకు తిప్పలు తప్పవు. మనుషులం కాబట్టే మన భాష సరళంగా ఉండాలి. కానీ రాక్షసుడిలా రెచ్చిపోతే మనక జంతువులకు తేడా ఉండదు. ఇలా చేసే వాళ్లు నరకానికి వెళతారని చాణక్యుడు చెప్పాడు.