Chanakya Niti: చాణక్యుడు మౌర్య సామ్రాజ్యంలో రాజకీయవేత్తగా ఎన్నో సూచనలు అందించారు. అలాగే మనుషుల జీవితాలకు సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలు చెప్పాడు. అప్పటినుంచి చాణక్య నీతి సూత్రాన్ని చాలామంది ఫాలో అవుతూ వస్తున్నారు. చాణక్య నీతి ప్రకారం మనుషులు అలవాట్లు, ఆచరణలు, పద్ధతులు ఎలా ఉండాలో తెలుపుతుంది. అలాగే ఒక వ్యక్తికి సమాజంలో గుర్తింపు రావాలంటే కొన్ని అలవాట్లను ఏర్పాటు చేసుకోవాలని చాణక్యనీతి తెలుపుతుంది. ఈ అలవాట్ల ద్వారా ఎదుటివారి మనస్తత్వాన్ని గెలుచుకుంటారు. అలాగే ఈ అలవాట్లు మరొకరికి పెంచడం ద్వారా సమాజమే బాగుపడుతుంది అని చాణిక్య నీతి తెలుపుతుంది. ఇంతకీ ఒక వ్యక్తికి ఎటువంటి అలవాట్లు ఉండాలి? వాటిని ఏవిధంగా పాటించాలి? ఆ వివరాలకు వెళ్తే..
Also Read: కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు ఇలా చేయండి..
చాణిక్య నీతి ప్రకారం సమాజంలో స్త్రీలను గౌరవించాలి. ముఖ్యంగా ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా సమాజంలో ఉన్న మహిళలను గౌరవించినట్లేనని చాణక్యనీతి తెలుపుతుంది. అంతేకాకుండా ఎదుటివారి మహిళలతో చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. అలాగే మహిళలకు సహాయం చేయడం ద్వారా సమాజంలో గౌరవం పొందుతారు.
కొందరు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటల వల్ల సమాజంలో చెడ్డపేరు వస్తుంది. అందువల్ల మంచి మాటలను మాత్రమే వదలాలి. ఇలా చేయడం వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. మంచి మాటల ద్వారా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మెరుగైన సమాజం కోసం ఇతరులకు లేదా పిల్లలకు మంచి మాటలు నేర్పించాలి. అలాగే సంబంధాలు మెరుగుపడాలంటే మంచి మాట ముఖ్యమని చాణిక్యనీకే తెలుపుతుంది.
సమాజంలో గుర్తింపు ఉండాలంటే అలవాట్లు కూడా చాలా అవసరం. అయితే ఇవి మంచి అలవాట్లు అయి ఉండాలి. మద్యం, ధూమపానం వంటి వ్యసనాలకు కాకుండా.. మంచి అలవాటులను కలిగి ఉండడం వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా ఈ అలవాట్ల ద్వారా ఇతరులు కూడా తమ జీవితాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ఉన్న మంచి అలవాట్లతో ఒక ప్రాంతాన్ని స్వచ్ఛంగా మార్చే అవకాశం ఉంటుందని చాణక్యనీతి తెలుపుతుంది.
సమాజంలో ఎంతోమంది ధనికులు, పేదవారు ఉంటారు. అయితే ధనికులు పేదవారికి సాయం చేయడం వల్ల అందరూ సమానంగా మారిపోతారు. అందువల్ల ఒక వ్యక్తికి సమాజంలో గుర్తింపు రావాలంటే సాయం చేసే గుణం ఉండాలని చాణక్యనీతి తెలుపుతుంది. సహాయం కేవలం ధన రూపంలోనే కాకుండా వస్తు రూపంలో లేదా ఇతర పద్ధతుల్లో కూడా సహాయం చేసే అవకాశాన్ని పొందాలి. అలా చేయడం ద్వారా ఎదుటివారి ఆశీస్సులు పొందగలుగుతారు.
ఒక వ్యక్తికి సమాజంలో గుర్తింపు రావాలంటే అందరితో కలిసి మెలిసి ఉండాలి. ముఖ్యంగా కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. వివాహ రైతులుగా ఉన్నప్పుడే ఆ వ్యక్తికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి చెడు వాక్యాలు కాకుండా చెడు పనులు చేయకుండా ఉన్నప్పుడే ఇలాంటి వివాదాలు జరగవు. ఒకవేళ కొన్ని వివాదాలు ఏర్పడిన వాటిని ఆలోచన శక్తితో పరిష్కరించుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
Also Read: దేశం గర్వించే క్షణం.. భారత సాంస్కృతిక వారసత్వానికి అరుదైన గుర్తింపు