Chanakya Niti: కష్ట సమయంలో ఈ 5 జాగ్రత్తలు పాటించండి.. జీవితం సుఖమయం

పటిష్టమైన వ్యూహం.. సంక్షోభాలు చుట్టుముడితే.. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించాలి. సంక్షోభంలో, సమస్యలలో వ్యూహాలు ఉంటే, చురుగ్గా ఆ సమస్య నుంచి బయటపడగలిగితే మీరు తేలికగా 'గట్టెక్కుతారు.

Written By: Swathi, Updated On : March 28, 2024 2:17 pm

Chanakya Niti

Follow us on

Chanakya Niti: ఏదో ఒక సమయంలో కచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కష్టాలను ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం సమస్యలను చూసి అసలు టెన్షన్ పడరు. అంతేకాదు చాలా ఈజీగా వాటిని పరిష్కరించుకుంటారు కూడా. కొందరు మాత్రం చిన్న సమస్యకే చాలా భయాందోళనలకు గురవుతారు. అంతేకాదు ఈ కష్టాలకు భయపడి, ఎదుర్కొనే సత్తా లేక అసమర్థులుగా వారిని వారే అనుకుంటారు. వీరి కోసం చాణక్యుడు ఏం చెప్పాడంటే..

పటిష్టమైన వ్యూహం.. సంక్షోభాలు చుట్టుముడితే.. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించాలి. సంక్షోభంలో, సమస్యలలో వ్యూహాలు ఉంటే, చురుగ్గా ఆ సమస్య నుంచి బయటపడగలిగితే మీరు తేలికగా ‘గట్టెక్కుతారు.

ముందుగానే సిద్ధం కావాలి.. కష్టాలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు చాణక్యుడు. కష్టాలు వస్తే ఎన్నో సమస్యలను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే గ్రహించగలగాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోవడం కాదు ముందుండి పరిష్కరించుకోవాలి అన్నారు చాణక్యుడు.

ఓపిక.. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు సమనం కోల్పోకూడదు. పాజిటివ్ గా ఉంటేనే జీవితం బాగుంటుంది అన్నారు చాణక్యుడు. మరీ ముఖ్యంగా సహనాన్ని అసలే కోల్పోవద్దు. మంచి రోజులు వచ్చే వరకు ప్రశాంతంగా ఉండడమే ఉత్తముల లక్షణం అంటారు.

కుటుంబ సభ్యుల రక్షణ.. సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటం మొదటి కర్తవ్యం. వారిని కష్టాల నుంచి బయట పడేయటానికి అన్ని విధాలా తగిన చర్యలు తీసుకోవాలి.

డబ్బు ఆదా.. డబ్బు ఆదా చేయడం మాత్రం మర్చిపోకండి. ఆపద సమయాల్లో డబ్బే మిమ్మల్ని రక్షిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు లేకపోతే మరింత సమస్యల్లో కూరుకొని పోతారు అని తెలిపారు చాణక్యుడు.