Chanakya Niti Money: మనం అపాత్ర దానం చేయకూడదు. మనం చేసే దానానికి విలువ ఉండాలి. బాగా డబ్బున్న వాడికి సాయం చేస్తే అది ఫలితం ఉండదు. పేదవారికి సాయం చేయడం మంచిదే. అర్హత గల వారికి సాయం చేస్తే మంచిదే. కానీ కడుపు నిండిన వాడికి అన్నం పెడితే వాడు తినలేడు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే వాడు సుఖీభవ అని దీవిస్తాడు. అలాగే మనం చేసే సాయం కూడా అలాగే ఉండాలి. పాత్ర ఎరిగి సాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది.
రహస్యాలు
మన బలహీనతలు, రహస్యాలు ఇతరులకు చెప్పకూడదు. ఒకవేళ మనం చెబితే అవసరమైనప్పుడు వారు మన రహస్యాలను బట్టబయలు చేస్తారు. వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవడమే మంచిది. లేదంటే ఇబ్బందులు రావడం సహజం. అందుకే మన ఇంటి విషయాలు బయటకు చెప్పకూడదు. అలా చేస్తేనే మనకు విలువ ఉంటుంది.
స్వార్థం
స్వార్థంగా ఆలోచించే వారి నుంచి దూరంగా ఉండాలి. మంచి వారికి మాత్రం సాయం చేయాలి. ఇలాంటి వారికి సాయం చేయడం మంచిది కాదు. మంచి వారికి సాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చాణక్యుడి ప్రకారం మనం చేసే దానం వృథా కాకుండా ఉంటేనే శ్రేయస్కరం. ఇలా మనం సామాజిక సేవా కార్యక్రమాలకు సాయం చేస్తే ఎంతో సురక్షితం.
పాత్ర ఎరిగి చేయాలి
మనం చేసే సాయం దుర్వినయోగం కాకుండా చూడాలి. ఎప్పుడు కూడా పేద వారికి సాయం చేయాలి. కానీ ఉన్న వాడికి చేయడం వల్ల మనం చేసిన దానికి గుర్తింపు ఉండదు. మన నిర్ణయాలు చెడు ఫలితాలు ఇవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే మనం చేసిన దానికి సరైన ఫలితం ఉంటుంది. మనం చేసే దానం విలువ లేకుండా పోతే బాగుండదు.