Chanakya Niti: ఆచార్యచాణక్యుడు మనకు ఎన్నో విషయాలు తెలిపారు. ఆయన సూచించిన అంశాలు నేటికి కూడా ప్రభావం చూపుతున్నాయి. అప్పటి పరిస్థితుల్లో కూడా అతడు నేటివిటికి పనికొచ్చే విషయాలు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో మనిషి తన జీవితంలో ఏ విషయాలను ఎక్కువగా పట్టించుకోవచ్చో కూడా విశదీకరించాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నాలుగు విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తే పుణ్యం వస్తుందని చెబుతాడు. మన జీవితం మీద మనం చేసే పుణ్యకార్యాల ప్రబావం కూడా ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో ఆ విషయాలంటే తెలుసుకుందాం.

మనకు గాయత్రీ మంత్రం ఎంతో ఉపయుక్తమైనది. దీంతో గాయత్రి మంత్రాన్ని దివ్య మంత్రంగా భావించి రోజు పారాయణం చేస్తే మనకు మంచి జరుగుతుంది. గాయత్రి మంత్రంలో వేదాత్మ ఉంటుంది. వేదాలకు గాయత్రి మంత్రమే మూలం కావడంతో దీన్ని పఠించడంతో మనకు భాగ్యమే కలుగుతుంది. గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా గుర్తిస్తారు. దీని వెనుక ఉన్న భావం ఏమిటంటే గాయత్రి మంత్రం జపించడం వల్ల మన జీవితమే మారిపోతోందని సూచించాడు. వేదాలు కూడా ఈ మంత్రం నుంచే పుట్టినట్లు భావిస్తారు.
Also Read: Kuppam: కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు… చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చే?
చాణక్యుడి నీతి ప్రకారం దానం కూడా గొప్పదే. మనం ఎవరికైనా ఆహారం, నీరు దానం చేస్తే మహాపుణ్యమే. ప్రపంచంలో ఇంతకన్నా విలువైనది మరొకటి లేదని గుర్తుంచుకోవాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వాడికి నీళ్లివ్వడం మంచి పుణ్య కార్యాలే. ఆపద కాలంలో ఇతరులకు సాయం చేయడం కూడా మంచిదే. దీంతో మనకు ఎక్కడ లేని పుణ్యం వస్తుంది. దీంతో మన జీవితమే మారిపోతోంది. అందుకే దానం చేయడానికి ఇష్టపడేవారికి మేలు జరుగుతుంది. ఇది ఆచార్య చాణక్యుడు ఆనాడే చెప్పాడు.

ఆచార్యుడి ప్రకారం మనకు జన్మనిచ్చిన తల్లిని కూడా బాగా చూసుకోవడం పుణ్యమే. లోకంలో చాలా మంది తల్లిదండ్రులను తిప్పలు పెడుతూ రాక్షసానందం పొందుతుంటారు. అలాంటి వారికి మంచి జరుగుతుంది. దేవుళ్లు, గురువులు, దేవాలయాలను ఎక్కువగా పూజిస్తారు. కానీ తల్లిని మాత్రం పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం కూడా లభిస్తుంది. భక్తి భావం ఉన్నా లేకున్నా తల్లిదండ్రులను సేవిస్తేనే మనకు ఎంతో పుణ్యం వస్తుందని ఆచార్య చాణక్యుడు ఆనాడే చెప్పడం గమనార్హం.
హిందూ ధర్మంలో ద్వాదశి తిథికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. క్యాలెండర్ లో ద్వాదశి తిథికి అత్యంత పవిత్రమైనదిగా భావించారు. విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథిగా దీన్ని నమ్ముతారు. ఈ రోజు భగవంతుడిని ఆరాధించడం, ఉపవాసం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనం కలుగుతుంది. విష్ణువు ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుంది. అందుకే ద్వాదశి తిథిని అత్యంత శక్తివంతమైనదిగా భావించి ఆరాధించడం వల్ల మనకు జీవితంలో ఎంతో మేలు కలుగుతుందని తెలుస్తోంది. ఆచార్య చాణక్యుడు సూచించిన ఈ నాలుగు అంశాలను పాటించి జీవితంలో మంచి స్థానం దక్కించుకోవాలని చాటిచెప్పాడు.
Also Read:Tejaswi Madivada: కౌశల్ ఆర్మీ టార్చర్ తట్టుకోలేక మందుకు అలవాటు పడ్డాను… పూర్తిగా షేప్ అవుట్ అయ్యాను

