https://oktelugu.com/

Sudigali Sudheer- Hyper Aadi: సుడిగాలి సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది.. కాళ్లు పట్టుకొని బ్యాడ్ చేయడానికేనా?

Sudigali Sudheer- Hyper Aadi: బుల్లితెర రంగంలో సుడిగాలి సుధీర్ కు ఉన్న క్రేజీ మామూలుది కాదు. సాధారణ కంటెస్టెంట్ గా వచ్చి తన ప్రతిభతో టీం లీడర్, వ్యాఖ్యాతగా ఎదిగాడు. బుల్లితెరలో సుడిగాలి సుధీర్ లేని షో అంటూ ఏదీ ఉండటం లేదు. ఇంకా సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇటు బుల్లితెర అంటు వెండితెరలో తన హవా కొనసాగిస్తూ తనకు ఎదురే లేదని నిరూపిస్తున్నాడు. మ్యాజిక్ , సాహస కార్యాలతో కూడా సుధీర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 26, 2022 / 09:41 AM IST
    Follow us on

    Sudigali Sudheer- Hyper Aadi: బుల్లితెర రంగంలో సుడిగాలి సుధీర్ కు ఉన్న క్రేజీ మామూలుది కాదు. సాధారణ కంటెస్టెంట్ గా వచ్చి తన ప్రతిభతో టీం లీడర్, వ్యాఖ్యాతగా ఎదిగాడు. బుల్లితెరలో సుడిగాలి సుధీర్ లేని షో అంటూ ఏదీ ఉండటం లేదు. ఇంకా సినిమాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇటు బుల్లితెర అంటు వెండితెరలో తన హవా కొనసాగిస్తూ తనకు ఎదురే లేదని నిరూపిస్తున్నాడు. మ్యాజిక్ , సాహస కార్యాలతో కూడా సుధీర్ కు ఎనలేని ఖ్యాతి లభించింది. మొత్తానికి సుధీర్ కు లైఫ్ ఇచ్చింది మాత్రం మల్లెమాల అని చెప్పక తప్పదు. ఈటీవీ నుంచి ఎదిగిన సుధీర్ ప్రస్తుతం స్టార్ మాలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు ఈటీవీకి గుడ్ బై చెప్పినట్లే.

    Sudigali Sudheer- Hyper Aadi

    ఈటీవీ ప్రారంభించి 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భలే మంచి రోజు అనే ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి అందరిని ఆహ్వానించారు. అందులో సుధీర్, హైపర్ ఆది సహా అందరు ఉన్నారు. ఈ షోలో సుధీర్ పై పంచుల వర్షం కురిపించారు. సుధీర్ ఈటీవీని వదిలిపెట్టడంపై కూడా ఆది పంచులు వదలలేదు. దీంతో సుధీర్ తెగ ఇబ్బంది పడతాడు. అయినా ఆది వదలకుండా కంటిన్యూగా పంచులు వేస్తూనే ఉండటంతో చివరకు ఆది కాళ్లు పట్టుకుంటాడు.

    జబర్దస్త్ నుంచి చాలా మంది వెళ్లిపోయారు. చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వండర్ వేణు, ధనాధన్ ధన్ రాజ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. వీరు అందరు వెళ్లిపోవడానికి కారణం మల్లెమాల యాజమాన్యమే అని వారు చెప్పడం తెలిసిందే. ప్రస్తుతం కొత్తవాళ్లతో చేస్తున్న స్కిట్లతో పెద్దగా హాస్యం పండటం లేదు. పంచుల వర్షం కురవడం లేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ భవితవ్యం గందరగోళంలో పడుతోంది. సీనియర్ ఆర్టిస్టులు దూరం కావడంతో షో వెలవెలబోతోంది.

    Sudigali Sudheer- Hyper Aadi

    భలే మంచి రోజుకు మాత్రం అందరు ఆర్టిస్టులు వచ్చారు. దీంతో సందడి కనిపించింది. హైపర్ ఆది పంచులకు సుడిగాలి సుధీర్ తేరుకోలేకపోయాడు. తనదైన శైలిలో పంచులు వేయడంలో ఆదిని మించిన వారు లేరనే చెప్పాలి. దీంతో సుధీర్ తో ఆడుకున్నాడు. సుధీర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కమెడియన్లు రచ్చ చేయడంతో ఒకసారి మారితే ఇలాగే ఉంటుందని పంచ్ వేస్తాడు. తరువాత యాంకర్ ప్రదీప్ సుధీర్ ను చూపిస్తూ ఈయన మిమ్మల్ని ఒక చోట ఉంచుతాడు అంటే ముందు ఆయన్ని ఒక చోట ఉండమను అంటూ సెటైర్ వేస్తాడు.

    ఇందులో భాగంగా ఓ స్కిట్ చేసే సందర్భంలో ఒక అమ్మాయి ఆదితో అంటుంది అన్నయ్య నేను సుధీర్ ను ప్రేమించాను అని చెబుతుంది. దీనికి సుధీర్ అప్పుడులా కాదండి నేను మారిపోయాను అంటే పక్క చానల్ కా అంటాడు. దీంతో నవ్వులు విరుస్తాయి. చివరకు సుధీర్ ఆది కాళ్లు పట్టుకుంటాడు. నన్ను వదిలేయ్ అని దీంతో అందరు నవ్వుకుంటారు. కాళ్లు పట్టుకుంది బ్యాడ్ చేయడానికేనా అంటూ ఆది స్టేజీ దిగి వెళ్లిపోతాడు. దీంతో భలే మంచి రోజు కార్యక్రమంలో నవ్వుల పువ్వులు పూశాయి.

     

     

     

    Tags